యాక్సిస్‌ బ్యాంకు కార్డుల వినియోగదార్లకు సరికొత్త సదుపాయం

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వినియోగంపై లభించే రివార్డు పాయింట్లను వాడుకోవడానికి సరికొత్త లాయల్టీ కార్యక్రమాన్ని యాక్సిస్‌ బ్యాంకు ఆవిష్కరించింది.

Published : 07 Feb 2023 01:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వినియోగంపై లభించే రివార్డు పాయింట్లను వాడుకోవడానికి సరికొత్త లాయల్టీ కార్యక్రమాన్ని యాక్సిస్‌ బ్యాంకు ఆవిష్కరించింది. దీని కోసం ఈ బ్యాంకు, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, మారియట్‌ ఇంటర్నేషనల్‌, ఐటీసీ హోటల్స్‌, తుర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌, ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌... తదితర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ప్రకారం యాక్సిస్‌ బ్యాంకు వినియోగదార్లు, తమ క్రెడిట్‌/డెబిట్‌ కార్డులను వినియోగించినప్పుడు లభించే ఎడ్జ్‌ రివార్డు పాయింట్లను ఈ సంస్థల నుంచి పొందే సేవల కోసం బదిలీ చేయవచ్చు. తద్వారా తమ వినియోగదార్లకు సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అవుతుందని యాక్సిస్‌ బ్యాంకు అధ్యక్షుడు (కార్డులు, చెల్లింపుల విభాగం) సంజీవ్‌ మోఘే తెలిపారు. యాక్సిస్‌ బ్యాంకు కార్డుల వినియోగం ద్వారా లభించే రివార్డు పాయింట్లను రవాణా సేవల విభాగంలో అధికంగా వినియోగించుకునేందుకు వీలు కలుగుతుందని అన్నారు. దీనివల్ల వినియోగదార్లతో తమ బాంధవ్యం బలపడుతుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని