ఓలా విద్యుత్తు కారు 2024లో

వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో తొలి విద్యుత్తు కారును ఆవిష్కరించే దిశగా పయనిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రకటించింది.

Published : 09 Feb 2023 02:29 IST

చ్చే ఏడాది ద్వితీయార్ధంలో తొలి విద్యుత్తు కారును ఆవిష్కరించే దిశగా పయనిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రకటించింది. విద్యుత్తు ద్విచక్ర వాహన ఉత్పత్తుల్లో మేం వాడుతున్న సాంకేతికత నుంచి కారుకూ ప్రయోజనాలు పొందుతామని, కారు డిజైన్‌ విషయంలో ముందస్తు దశలపై దృష్టి సారిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌ఓ జి.ఆర్‌. అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ‘సాఫ్ట్‌వేర్‌, భద్రతా వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్‌, సెల్స్‌, డ్రైవ్‌ ట్రైన్‌.. ఇలా చాలా వరకు ఒకటే ఉంటాయి. కార్ల తయారీకి కావాలసిన అంశాల్లో మా వద్ద 30-40 శాతం వరకు ఉన్నట్లు భావిస్తున్నామ’ని కుమార్‌ తెలిపారు. విద్యుత్తు కార్లకు సంబంధించి టెస్లా ఇంక్‌, హ్యుందాయ్‌ మోటార్‌లతో పాటు స్థానికంగా టాటా మోటార్స్‌తో పోటీ పడాలని ఓలా భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని