Adani Group: ఎస్‌బీఐకి మరిన్ని షేర్ల తాకట్టు

షేర్ల విలువలు బాగా తగ్గిన నేపథ్యంలో, 3 అదానీ గ్రూప్‌ కంపెనీలు ప్రభుత్వరంగ స్టేట్‌ బ్యాంక్‌ బ్యాంక్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు అదనంగా మరిన్ని షేర్లను తాకట్టు పెట్టాయి.

Updated : 13 Feb 2023 11:29 IST

అదానీ గ్రూప్‌

దిల్లీ: షేర్ల విలువలు బాగా తగ్గిన నేపథ్యంలో, 3 అదానీ గ్రూప్‌ కంపెనీలు ప్రభుత్వరంగ స్టేట్‌ బ్యాంక్‌ బ్యాంక్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు అదనంగా మరిన్ని షేర్లను తాకట్టు పెట్టాయి. అమెరికాకు చెందిన షార్ట్‌-సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణల అనంతరం, అదానీ గ్రూప్‌ సంస్థల మార్కెట్‌ విలువ 100 బిలియన్‌ డాలర్లకు పైగా కోల్పోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే తాము తీసుకున్న రుణాలకు గాను, ఎస్‌బీఐ వద్ద మరిన్ని షేర్లను తాకట్టు పెట్టినట్లు ఎక్స్ఛేంజీలకు ఆయా సంస్థల నుంచి సమాచారం అందింది.

* అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌), అదానీ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థలు ఎస్‌బీఐ యూనిట్‌ ఎస్‌బీఐ క్యాప్‌ ట్రస్టీ కంపెనీ వద్ద అదనంగా షేర్లను తాకట్టు పెట్టాయి. ఏపీఎస్‌ఈజెడ్‌ అదనంగా 75 లక్షలకు పైగా తాకట్టు పెట్టింది. వీటితో కలిపి సంస్థలో మొత్తం    1 శాతం షేర్లను ఎస్‌బీఐక్యాప్‌ వద్ద తాకట్టు పెట్టినట్లు అయ్యింది.
* అదానీ గ్రీన్‌ 60 లక్షలకు పైగా అదనపు షేర్లను తాకట్టు పెట్టడంతో, మొత్తం 1.06 శాతం వాటా తాకట్టులో ఉన్నట్లయ్యింది.
* అదానీ ట్రాన్స్‌మిషన్‌ 13 లక్షలకు పైగా అదనపు షేర్లను ఎస్‌బీఐక్యాప్‌ వద్ద తాకట్టు పెట్టడంతో ఈ కంపెనీలోని 0.55 శాతం వాటా ఎస్‌బీఐ వద్ద ఉంది.
* అదనంగా పెట్టిన షేర్ల తాకట్టుతో 300 మిలియన్‌ డాలర్ల లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఓసీ)ను వేరే బ్యాంక్‌కు ఎస్‌బీఐ జారీ చేసింది. ఆస్ట్రేలియాలోని అదానీ గ్రూప్‌నకు చెందిన కార్మిఖేల్‌ బొగ్గు గని ప్రాజెక్టులో చెల్లింపులకు గ్యారెంటీగా ఎస్‌బీఐ ఎల్‌ఓసీని జారీ చేసింది.

నేటి బోర్డు సమావేశాలు

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, పీఎఫ్‌సీ, ఇక్రా, హడ్కో, ఐఎఫ్‌సీఐ, నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌, నైకా, వోకార్డ్‌, పీవీపీ, ఒమాక్స్‌, బజాజ్‌ హెల్త్‌కేర్‌, గుజరాత్‌ గ్యాస్‌, హైడెల్‌బర్గ్‌ సిమెంట్‌, బజాజ్‌ హిందుస్థాన్‌ షుగర్‌, శ్రీరేణుకా షుగర్‌, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌, స్పార్క్‌,  తమిళనాడు న్యూస్‌ప్రింట్‌ అండ్‌ పేపర్స్‌, అంజనీ ఫుడ్స్‌, బీజీఆర్‌ ఎనర్జీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని