పసిడి సానుకూలం!

పసిడి ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.59,668 స్థాయిని అధిగమిస్తే.. రూ.60,649; రూ.60,996 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.57,886 కంటే కిందకు వస్తే... రూ.56,332, రూ.54,361 వరకు పడిపోవచ్చు.

Published : 20 Mar 2023 02:00 IST

కమొడిటీస్‌ ఈ వారం
బంగారం

పసిడి ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.59,668 స్థాయిని అధిగమిస్తే.. రూ.60,649; రూ.60,996 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.57,886 కంటే కిందకు వస్తే... రూ.56,332, రూ.54,361 వరకు పడిపోవచ్చు. అందువల్ల రూ.57,886 వద్ద స్టాప్‌లాస్‌ను పరిగణిస్తూ ప్రస్తుత లాంగ్‌ పొజిషన్లు కొనసాగించొచ్చు.


వెండి

వెండి మే కాంట్రాక్టుకు రూ.64,881 వద్ద స్టాప్‌లాస్‌ను పరిగణిస్తూ రూ.65,091- రూ.65,998 మధ్య కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదే. రూ.70,463- రూ.71,371 వరకు లక్ష్యం పెట్టుకోవచ్చు.


ప్రాథమిక లోహాలు

* రాగి మార్చి కాంట్రాక్టు రూ.751 దిగువన కదలాడితే, రూ.747- 742.75 వరకు దిద్దుబాటు కావచ్చు. రూ.753 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

*  సీసం మార్చి కాంట్రాక్టు రూ.181 దిగువన బలహీనంగా కనిపిస్తోంది. ఈ స్థాయి వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.183 ఎగువన కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు.

*  జింక్‌ మార్చి కాంట్రాక్టు రూ.254 కంటే దిగువన ముగిస్తే లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది.

* అల్యూమినియం మార్చి కాంట్రాక్టును రూ.200-201 స్థాయుల్లో కొనుగోలు చేయొచ్చు.


ఇంధన రంగం

* ముడి చమురు ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.5,236 కంటే కిందకు రాకుంటే రూ.5,947; రూ.6,153 వరకు పెరగొచ్చు. అయితే రూ.5,421 స్థాయిని కోల్పోతే రూ.5,236 వరకు తగ్గొచ్చు. రూ.5,301 స్థాయిని స్టాప్‌లాస్‌గా పరిగణించాలి.

* సహజ వాయువు మార్చి కాంట్రాక్టు రూ.191 కంటే కిందకు రాకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదే. రూ.208 వద్ద నిరోధాన్ని అధిగమిస్తే రూ.214 వరకు వెళ్లొచ్చు. రూ.191 దిగువన రూ.184 వరకు పడిపోవచ్చు.


వ్యవసాయ ఉత్పత్తులు

*  పసుపు ఏప్రిల్‌ కాంట్రాక్టుకు రూ.6,520 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, ధర తగ్గినప్పుడల్లా కొనుగోళ్లకు మొగ్గు చూపడం ఉత్తమం. రూ.6837 స్థాయిని దాటితే రూ.6,984ను పరీక్షించే అవకాశం ఉంది.  

* జీలకర్ర ఏప్రిల్‌ కాంట్రాక్టు కిందకు వస్తే రూ.31,326 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.29,545 వరకు పడిపోవచ్చు. ఒకవేళ పెరిగితే రూ.34,001 వద్ద నిరోధాన్ని అధిగమిస్తే రూ.34,893 వరకు రాణించొచ్చు.

*  ధనియాలు ఏప్రిల్‌ కాంట్రాక్టుకు అధిక స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. రూ.6,807 వద్ద మద్దతు లభించొచ్చు. రూ.6650 స్థాయిని మించితే రూ.7087; రూ.7211 వరకు వెళ్లొచ్చు.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని