Flights: అమెరికా మార్గాల్లో విమాన సర్వీసుల తాత్కాలిక తగ్గింపు
భారత్ నుంచి అమెరికాకు వెళ్లే కొన్ని మార్గాల్లో విమానాల సర్వీసుల సంఖ్యను తాత్కాలికంగా తగ్గించనున్నట్లు ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు.
ఎయిరిండియా సీఈఓ
దిల్లీ: భారత్ నుంచి అమెరికాకు వెళ్లే కొన్ని మార్గాల్లో విమానాల సర్వీసుల సంఖ్యను తాత్కాలికంగా తగ్గించనున్నట్లు ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. విమాన క్యాబిన్ సిబ్బంది (క్రూ) కొరతే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అమెరికాకు వారంలో ఆరు విమాన సర్వీసులు- నెవార్క్‌కు 3, శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లేవి 3 తగ్గించనున్నామని తెలిపారు. రాబోయే 2-3 నెలల్లో ఈ సర్వీసుల కోత ఉంటుందని విల్సన్ పేర్కొన్నారు. మూడు నెలల్లో బోయింగ్ 777 విమానాల కోసం తమకు 100 మంది పైలట్లు ఉంటారని, 1,400 మంది క్యాబిన్ సిబ్బంది శిక్షణలో ఉన్నారని వివరించారు. ‘విమాన సిబ్బంది కొరత కారణంగా కొన్ని దీర్ఘకాల ప్రయాణ సర్వీసులపై ప్రభావం పడుతోంది. అందుకే కొన్ని అమెరికా మార్గాల్లో సర్వీసుల సంఖ్యను తగ్గించనున్నామ’ని కాపా ఇండియా సదస్సులో విల్సన్ తెలిపారు. ప్రస్తుతం ఎయిరిండియాలో ఫ్లైయింగ్ (గగనతల విహారంతో సంబంధమున్న), నాన్- ఫ్లైయింగ్ (సంబంధం లేని) ఉద్యోగులు మొత్తం 11,000 మంది వరకు ఉన్నారు.
విమానాల కొనుగోలుకు నిధులు సమీకరిస్తాం: బోయింగ్, ఎయిర్‌బస్‌ల నుంచి 470 విమానాల కొనుగోలుకు అవసరమైన భారీమొత్తం నిధులను సమీకరిస్తామనే నమ్మకంతో ఉన్నామని ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. ఈ ఏడాది చివరి నుంచి ఈ విమానాల సరఫరా మొదలవుతుంది. నిధుల కోసం బ్యాంకులతో ఇప్పటికే ఎయిరిండియా సంప్రదింపులు జరుపుతోంది. తమ యజమాని టాటా సన్స్ నుంచి సహకారం లభిస్తుందని సంస్థ భావిస్తోంది. ‘మాకు టాటా సన్స్ అండ ఉంది. అందువల్ల విమానాల కొనుగోలుకు అవసరమైన నిధులు లభిస్తాయ’ని కాపా ఇండియా ఏవియేషన్ సదస్సు సందర్భంగా క్యాంప్‌బెల్ తెలిపారు. తమ అంతర్గత నిధుల నుంచి కొత్త విమానాల కోసం ఇప్పటికే కొంత మొత్తాన్ని ముందస్తుగా చెల్లించామని తెలిపారు. పెద్ద పరిమాణ (వైడ్‌బాడీ) విమానాల నవీకరణ కోసం 400 మిలియన్ డాలర్లను (సుమారు రూ.3,280 కోట్లు) ఎయిరిండియా వెచ్చించనుంది.
2023-24లో 1.6- 1.8 బి.డా. నష్టం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన సంస్థలు ఏకీకృతంగా 1.6- 1.8 బిలియన్ డాలర్ల మేర నష్టాన్ని నమోదు చేసే అవకాశం ఉందని విమానయాన కన్సల్టెన్సీ సంస్థ కాపా ఇండియా సోమవారం తెలిపింది. ఇందులో పూర్తి స్థాయి సేవల విమానయాన సంస్థలకే 1.1- 1.2 బిలియన్ డాలర్ల మేర నష్టం రావొచ్చని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత విమానయాన సంస్థలకు కొత్తగా 132 విమానాలు సమకూరొచ్చని, దీంతో మొత్తం విమానాల సంఖ్య 816కు చేరొచ్చని తెలిపింది. సరఫరా, సరఫరాయేతర సమస్యల కారణంగా భారత విమానయాన సంస్థలకు చెందిన 100కి పైగా విమానాలు నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ..2023-24పై అంచనాలు వెల్లడిస్తూ కాపా తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!
-
Politics News
Andhra News: మరోసారి నోరు జారిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి
-
General News
Bed Rotting: ఏమిటీ ‘బెడ్ రాటింగ్’.. ఎందుకంత ట్రెండ్ అవుతోంది..?
-
Movies News
Rana Naidu: ఎట్టకేలకు ‘రానానాయుడు’ సిరీస్‌పై స్పందించిన వెంకటేశ్
-
India News
Manipur: మణిపుర్లో అమిత్ షా సమీక్ష.. శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవ్!
-
Viral-videos News
Beauty Pageant: అందాల పోటీల్లో భార్యకు అన్యాయం జరిగిందని.. కిరీటాన్ని ముక్కలు చేశాడు!