చదరపు అడుగు రూ.1.36 లక్షలు

హైదరాబాద్‌లో చదరపు అడుగు రూ.5-16 వేల వరకు ఉంది. అయితే ముంబయిలో చదరపు అడుగు రూ.1.36 లక్షల చొప్పున ఒక విలాసవంత అపార్టుమెంటులో ట్రిప్లెక్స్‌ అమ్ముడుపోయిందని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి.

Published : 01 Apr 2023 02:34 IST

హైదరాబాద్‌లో చదరపు అడుగు రూ.5-16 వేల వరకు ఉంది. అయితే ముంబయిలో చదరపు అడుగు రూ.1.36 లక్షల చొప్పున ఒక విలాసవంత అపార్టుమెంటులో ట్రిప్లెక్స్‌ అమ్ముడుపోయిందని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. దక్షిణ ముంబయిలోని మలబార్‌ హిల్‌లో రూ.369 కోట్లకు లగ్జరీ ట్రిప్లెక్స్‌ అపార్ట్‌మెంట్‌ను ఔషధ ఉత్పత్తుల సంస్థ ఫామీ కేర్‌ అధిపతి జేపీ తపారియా కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. లోధా గ్రూప్‌ సంస్థ మ్యాక్రోటెక్‌ డెవలపర్స్‌ ఈ అపార్ట్‌మెంట్‌ను విక్రయించింది. అత్యంత విలాసవంత గృహ సముదాయమైన లోధా మలబార్‌లో 26, 27, 28 అంతస్తుల్లో ఈ ఫ్లాట్‌ విస్తరించి ఉంది. ఈ ట్రిప్లెక్స్‌ మొత్తం విస్తీర్ణం 27,160 చదరపు అడుగులు. దీనికి రూ.369 కోట్ల ధర అంటే ఒక చదరపు అడుగు విలువ రూ.1.36 లక్షలుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని