iphone SE 4: అందుబాటు ధరలో ఐఫోన్‌ ఎస్‌ఈ 4!..

ప్రీమియం ఐఫోన్లతో పాటు అందుబాటులో ధరల్లో ఎస్‌ఈ సిరీస్‌ ఫోన్లను యాపిల్‌ సంస్థ విడుదల చేస్తోంది. వచ్చే ఏడాది కూడా అందుబాటు ధరలో ఐఫోన్‌ ఎస్‌ఈ 4ను యాపిల్‌ విపణిలోకి తీసుకొస్తుందని మాషబుల్‌ అనే సంస్థ వెల్లడించింది.

Published : 09 Apr 2023 08:32 IST

వచ్చే ఏడాదిలో ఆవిష్కరించే అవకాశం

వాషింగ్టన్‌: ప్రీమియం ఐఫోన్లతో పాటు అందుబాటులో ధరల్లో ఎస్‌ఈ సిరీస్‌ ఫోన్లను యాపిల్‌ సంస్థ విడుదల చేస్తోంది. వచ్చే ఏడాది కూడా అందుబాటు ధరలో ఐఫోన్‌ ఎస్‌ఈ 4ను యాపిల్‌ విపణిలోకి తీసుకొస్తుందని మాషబుల్‌ అనే సంస్థ వెల్లడించింది. దీని ప్రకారం, ఎస్‌ఈ 4 మోడల్‌ గూగుల్‌కు చెందిన పిక్సెల్‌ 7ఎ తో పోటీపడబోతోంది. ఎస్‌ఈ మోడళ్లు తక్కువ ధర కలిగిన ఐఫోన్లు. వీటిని గూగుల్‌ పిక్సెల్‌ ధరల్ని దృష్టిలో ఉంచుకుని యాపిల్‌ తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది తీసుకురాబోతున్న ఎస్‌ఈ 4 పరిమాణం చిన్నగా ఉండకపోవచ్చని నివేదిక తెలిపింది. ఆ ఫోన్‌కు 5.7 / 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉండొచ్చని పేర్కొంది. 2022లో వచ్చిన ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్‌ 4.7 అంగుళాల డిస్‌ప్లేతో విపణిలోకి వచ్చింది. కొత్త మోడల్‌ పరిమాణం మాత్రం ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 14కు దగ్గరగా ఉండొచ్చని నివేదిక తెలిపింది. తెర అన్‌లాకింగ్‌కు ముఖ గుర్తింపు సాంకేతికతను ఈ ఫోన్‌లో వాడొచ్చని అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని