హోండా ఎస్‌యూవీ ఎలివేట్
మధ్యశ్రేణి స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) ‘ఎలివేట్’ను హోండా కార్స్ ఇండియా మంగళవారం ఆవిష్కరించింది. ఈ కారు ధరను సంస్థ వెల్లడించలేదు.
దిల్లీ: మధ్యశ్రేణి స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) ‘ఎలివేట్’ను హోండా కార్స్ ఇండియా మంగళవారం ఆవిష్కరించింది. ఈ కారు ధరను సంస్థ వెల్లడించలేదు. ఇక్కడే తయారు చేయడంతో పాటు, ప్రపంచంలోనే తొలిసారిగా దేశీయ విపణిలోకి ఈ కారును రాబోయే పండగ సీజనులో విడుదల చేయనుంది. ఇక్కడ నుంచి ఎగుమతులూ చేయనుంది. ఈ కారు కోసం జులై నుంచి బుకింగ్‌లు స్వీకరిస్తామని తెలిపింది. రోడ్డుపై ప్రతి ఒక్కరికి భద్రత ఉండేలా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అమర్చిన ఈ కారు 1.5 లీటర్ ఐవీ టెక్ డీఓహెచ్‌సీ ఇంజిన్‌తో, 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ కంటిన్యువస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్‌తో లభించనుంది. మూడేళ్లలోగా ఎలివేట్‌లో బ్యాటరీ ఆధారిత విద్యుత్ వాహన మోడల్‌నూ తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. 2030 కల్లా భారత్‌లో మరో 4 ఎస్‌యూవీలను ఆవిష్కరించే ఉద్దేశంలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్
-
భాజపా ఎమ్మెల్యే నివాసంలో యువకుడి ఆత్మహత్య: ప్రియురాలితో గొడవే కారణం
-
చంద్రయాన్-3 మహా క్విజ్‌లో పాల్గొనండి
-
ఆ పదవిలో ఎంతకాలం ఉంటానో చెప్పలేను..
-
కళ్లు పీకి.. జుట్టు కత్తిరించి... యువతి దారుణ హత్య!
-
భారాసను వీడాలని బోథ్ ఎమ్మెల్యే నిర్ణయం