Star Ratings For Cars: కార్లకు మన దగ్గరా స్టార్‌ రేటింగ్‌

కార్ల భద్రతా ప్రమాణాలకు సూచికగా నిలిచే గ్లోబల్‌ఎన్‌క్యాప్‌ రేటింగ్స్‌ తరహాలో దేశీయంగా స్టార్‌ రేటింగ్‌లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

Updated : 05 Jul 2023 08:35 IST

గ్లోబల్‌ఎన్‌క్యాప్‌ తరహాలో బీఎన్‌క్యాప్‌  
ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ

దిల్లీ: కార్ల భద్రతా ప్రమాణాలకు సూచికగా నిలిచే గ్లోబల్‌ఎన్‌క్యాప్‌ రేటింగ్స్‌ తరహాలో దేశీయంగా స్టార్‌ రేటింగ్‌లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగామ్‌(బీఎన్‌క్యాప్‌)పై ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి దీనిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా క్రాష్‌ పరీక్షల్లో, వాహనాలు ఎలా తట్టుకున్నాయి అనేదానిని బట్టి ‘స్టార్‌’ రేటింగ్‌లు ఇస్తుంటారు. అత్యంత సురక్షితమైనదైతే 5 స్టార్‌ రేటింగ్‌, మరీ అధ్వానమైతే 0 రేటింగ్‌ ఇస్తున్నారు. ‘దేశంలో తయారైన లేదా దిగుమతి అయిన, 3.5 టన్నుల కంటే తక్కువ బరువు ఉన్న కేటగిరీ ఎమ్‌1 వాహనాలకు ఈ బీఎన్‌క్యాప్‌ వర్తిస్తుంద’ని రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆ ముసాయిదా పేర్కొంది. 30 రోజుల్లోగా ఈ ప్రతిపాదనలపై స్పందనలు పంపాలని కేంద్రం కోరింది. స్పందనల అనంతరం ముసాయిదా నిబంధలను పరిశీలనలోకి తీసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని