AI Jobs: ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో సరికొత్త ఉద్యోగావకాశాలు

ఇపుడు అంతటా చాట్‌ జీపీటీ వంటి కృత్రిమ మేధ ఆధారిత ప్లాట్‌ఫారాల మాట వినిపిస్తోంది. చిన్న పిల్లలు హోం వర్క్‌ చేయడం దగ్గరి నుంచి ఉద్యోగులు తమ రోజువారీ పనిలో వీటిని విరివిగా వినియోగిస్తున్నారు.

Updated : 13 Aug 2023 07:45 IST

ఉత్పాదకతా పెరుగుతుంది
ఎక్కువ మంది అభిప్రాయం: సర్వే

ముంబయి: ఇపుడు అంతటా చాట్‌ జీపీటీ వంటి కృత్రిమ మేధ ఆధారిత ప్లాట్‌ఫారాల మాట వినిపిస్తోంది. చిన్న పిల్లలు హోం వర్క్‌ చేయడం దగ్గరి నుంచి ఉద్యోగులు తమ రోజువారీ పనిలో వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. వీటిపై ఎక్కువ మంది సానుకూలంగా ఉండడం విశేషం. అయితే కొంత మంది మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా నడిచే ప్లాట్‌ఫారాలలో క్రమంగా ఉద్యోగులు(మనుషులు) పనిచేయడం మొదలవుతుందని ఎక్కువ మంది ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కంటెంట్‌ క్రియేషన్‌, కోడింగ్‌, డిజైన్‌ వంటి ప్రక్రియల కోసం, ఉత్పాదకతను పెంచడం కోసం మనుషులపై ఆధాపడాల్సి వస్తుందని హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌ సంస్థ జీనియస్‌ కన్సల్టెంట్స్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. మే 15 నుంచి జూన్‌ 24 మధ్య వేర్వేరు పరిశ్రమల్లోని 1207 మంది వృత్తినిపుణులతో నిర్వహించిన ఈ సర్వేలోని ముఖ్యాంశాలు..

  • చాట్‌ జీపీటీతో పాటు ఈ తరహా ఏఐ ఫ్లాట్‌ఫారాల వల్ల ప్రయోజనమేనని 50% మంది అభిప్రాయపడ్డారు. 25% మంది మాత్రం వాటిపై ఎక్కువగా ఆధారపడడం, మనుషుల స్పందన ఉండకపోవడం, గోప్యత-భద్రతా ఇబ్బందుల వంటి సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అభిప్రాయాల నేపథ్యంలో ఏఐ శక్తి సామర్థ్యాలకు, మనుషుల ఆందోళనలకు మధ్య సమతౌల్యాన్ని తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తోందని జీనియస్‌ కన్సల్టెంట్స్‌ అంటోంది.
  • ప్రస్తుతం 47% మంది ఉద్యోగులు చాట్‌ జీపీటీని వినియోగిస్తున్నారు. 44 శాతం మంది వాడడం లేదు. ఏఐ ప్లాట్‌ఫారాల్లో లభ్యమవుతున్న సమాచారానికున్న ప్రయోజనాల నేపథ్యంలో వీటి వినియోగం పెరుగుతోంది.
  • ఆటోమేషన్‌ కారణంగా సంక్లిష్టత తొలగిపోయి.. పని నిర్వహణ సులువుగా అవుతోందని 67% మంది స్పందించారు. అయితే 18 శాతం మంది మాత్రం ఏఐ ప్లాట్‌ఫారాల సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
  • ఉద్యోగాలపై ప్రభావంపై 65 శాతం మంది ఆశావహంగా ఉన్నారు. కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయని, ఉత్పాదకత పెరుగుతుందని వారు భావిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని