HCL Tech: వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే

వారంలో మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేయాల్సిందేనని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తన ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది.

Updated : 14 Oct 2023 07:27 IST

ఉద్యోగులకు హెచ్‌సీఎల్‌ టెక్‌ ఆదేశాలు

దిల్లీ: వారంలో మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేయాల్సిందేనని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తన ఉద్యోగులకు సమాచారం ఇచ్చింది. అయితే ఆ మూడు రోజులు ఏవనేది ఉద్యోగుల ఇష్టానికే వదిలేయడం ద్వారా, వారికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు కంపెనీ సీఈఓ, ఎండీ సి విజయకుమార్‌  తెలిపారు. ఇప్పటికే కొన్ని స్థాయిల ఉద్యోగులకు, కార్యాలయాలకు రావడం తప్పనిసరి చేశామని.. ఈ0 నుంచి ఈ3 గ్రేడ్‌ల సిబ్బందికి మాత్రం తప్పనిసరి చేయలేదని విజయకుమార్‌ అన్నారు. ఇక నుంచి అందరికీ (ప్రత్యేక పరిస్థితుల్లో మినహా) వారంలో మూడు రోజుల పాటు కార్యాలయం నుంచి పని ఉంటుందన్నారు. పూర్తిగా ఇంటి నుంచి పని అనేది మంచి ఆలోచనేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అది కంపెనీకి, సిబ్బందికీ కూడా మంచిది కాదన్నారు.  ఇప్పటికే టీసీఎస్‌ తన ఉద్యోగులను అన్ని పనిదినాల్లోనూ కార్యాలయానికే వచ్చి పనిచేయాలని కోరింది. తద్వారా కరోనా సమయంలో మొదలైన పూర్తిస్థాయి వర్క్‌ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్‌హెచ్‌) సంప్రదాయానికి స్వస్తి పలికింది. ఇన్ఫోసిస్‌ మాత్రం ఈ విషయంలో పెద్దగా పట్టుబట్టడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని