Resume: తప్పుడు రెజుమేలతో కంపెనీలకు తిప్పలు

చాలా మంది ఉద్యోగార్థులు తమ రెజుమేలో తప్పుడు సమాచారం ఇస్తుండడంతో.. కంపెనీలు వ్యక్తిగత ఇంటర్వ్యూలకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. దాదాపు 40 లక్షల మందికి చెందిన రెజ్యుమేలు, 3000 జాబ్‌ పోస్టింగ్‌లను విశ్లేషించడంతో పాటు..

Updated : 25 Oct 2023 10:10 IST

అందుకే వ్యక్తిగత ఇంటర్వ్యూల వైపు  కంపెనీల మొగ్గు: హైర్‌ప్రొ నివేదిక

ముంబయి: చాలా మంది ఉద్యోగార్థులు తమ రెజుమేలో తప్పుడు సమాచారం ఇస్తుండడంతో.. కంపెనీలు వ్యక్తిగత ఇంటర్వ్యూలకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. దాదాపు 40 లక్షల మందికి చెందిన రెజుమేలు, 3000 జాబ్‌ పోస్టింగ్‌లను విశ్లేషించడంతో పాటు.. 3,000 మంది నియామక మేనేజర్లు, 500 మంది కార్పొరేట్‌ కస్టమర్లను సర్వే చేసిన అనంతరం నియామకాల సొల్యూషన్ల సంస్థ హైర్‌ప్రొ రూపొందించిన నివేదిక ప్రకారం..

  • ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారిలో 85 శాతానికి పైగా తమ రెజుమేలో తప్పుడు సమాచారం ఇస్తున్నారు. దశాబ్దం కిందట ఇది 65 శాతంగా ఉండేది.
  • ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన స్టాండర్డ్‌ రెజుమే టెంప్లేట్లు, ‘ప్రొఫెషనల్‌’ రెజుమే రైటర్లు, ఏఐ టూల్స్‌ను ఇందుకు వినియోగిస్తున్నారు.
  • 70 శాతం మంది రిక్రూటర్లు.. రెజుమేలను పరిశీలిస్తున్నప్పటికీ.. ఎవరినైనా నియమించుకోవాలనుకుంటే వ్యక్తిగత ఇంటర్వ్యూలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. కేవలం రెజుమేలపై ఆధారపడి ఉద్యోగం ఇవ్వడం అంతగా మంచిది కాదంటున్నారు.
  • రెజుమేలను పక్కనపెట్టి.. నైపుణ్యాలను మదింపు చేయడమే అత్యంత విశ్వసనీయమైన ప్రక్రియగా నియామకదార్లు భావిస్తున్నారు.
  • ఐటీ రంగంలో ఈ తరహాలో ఎంపికైన వారు.. సంప్రదాయ పద్ధతుల ద్వారా ఎంపికైనవారితో పోలిస్తే 73 శాతం అధిక పనితీరును కనబరుస్తున్నారు.
  • గతంలో రెజుమేలపై ఆధారపడడం వల్ల నిజంగా అర్హతగల అభ్యర్థులను తీసుకోలేకపోయినట్లు తెలుస్తోంది. అయితే గత అయిదేళ్లలో రిక్రూటర్లు రెజుమేలను చూసే పద్ధతిని మార్చుకున్నారు.
  • అయిదేళ్ల కిందటితో పోలిస్తే వ్యక్తిగత మదింపుపై ఆధారపడడం 26% నుంచి 49 శాతానికి పెరిగింది. ఇక సంబంధిత ఉద్యోగానికి అవసరమైన అనుభవ ప్రాధాన్యం 63 శాతం నుంచి 48 శాతానికి తగ్గింది.
  • ఏఐ, ఆటోకరెక్ట్‌ టూల్స్‌ రావడంతో అభ్యర్థుల వ్యాకరణానికి(గ్రామర్‌) ప్రాధాన్యం 19% నుంచి 14 శాతానికి పరిమితమైంది.
  • రాబోయే 18 నెలల్లో 75 శాతం వరకు రిక్రూటర్లు.. నైపుణ్యం ఆధారిత నియామకానికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇక 65 శాతం మంది ఈ ఏడాది అనుభవానికంటే నైపుణ్యానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని