ఇ-స్టోర్‌ను ఆవిష్కరించిన ఒరాఫో జువెల్స్‌

వెండి ఆభరణాలను విక్రయించే ఒరాఫో జువెల్స్‌ ఆన్‌లైన్‌ విపణిలోకి ప్రవేశించింది.

Published : 19 Nov 2023 01:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: వెండి ఆభరణాలను విక్రయించే ఒరాఫో జువెల్స్‌ ఆన్‌లైన్‌ విపణిలోకి ప్రవేశించింది. శనివారం సినీనటి కావ్య కల్యాణ్‌ రామ్‌ సంస్థ ఇ-స్టోర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే మూడు షోరూంలను నిర్వహిస్తున్నట్లు, వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఇ-స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ డైరెక్టర్‌ కల్యాణ్‌ రామ్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఫ్రాంఛైజీ విధానంలో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. వెండిలో వినూత్న ఆభరణాలు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఏటా 25 శాతం వరకూ వృద్ధిని సాధిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని