రూ.45,000 కోట్ల ఖనిజాల వేలం

రూ.45,000 కోట్ల విలువైన 20 కీలక ఖనిజాల వేలాన్ని బొగ్గు, ఖనిజాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి బుధవారం ప్రారంభించారు. ఇందులో రెండు లిథియం బ్లాక్‌(జమ్ము-కశ్మీర్‌, చత్తీస్‌గఢ్‌)లు కూడా ఉన్నాయని ఆయన వివరించారు.

Published : 30 Nov 2023 02:12 IST

ప్రారంభించిన ప్రభుత్వం

దిల్లీ: రూ.45,000 కోట్ల విలువైన 20 కీలక ఖనిజాల వేలాన్ని బొగ్గు, ఖనిజాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి బుధవారం ప్రారంభించారు. ఇందులో రెండు లిథియం బ్లాక్‌(జమ్ము-కశ్మీర్‌, చత్తీస్‌గఢ్‌)లు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. చత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, జార్ఖండ్‌, బిహార్‌ వంటి వివిధ రాష్ట్రాల్లో 20 బ్లాక్‌లను విక్రయానికి పెట్టినట్లు తెలిపారు. వీటి వేలం ద్వారా వచ్చే మొత్తం ఆదాయం ఆయా రాష్ట్రాలకే వెళుతుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 20న ఈ వేలం ముగుస్తుంది. మొత్తం 20 ఖనిజాల బ్లాకుల్లో 16 బ్లాకులను కాంపోజిట్‌ లైసెన్సు కోసం, నాలుగింటిని గనుల లీజు అనుమతికి ఉంచినట్లు వివరించారు. ఈ వేలం కేవలం తొలి దశ మాత్రమేనని.. రాబోయే దశల్లో మరిన్ని కీలక ఖనిజాల బ్లాక్‌లను వేలానికి ఉంచుతామని ఆయన అన్నారు. జమ్ము-కశ్మీర్‌లో తొలి లిథియం డిపాజిట్లను ఫిబ్రవరిలో కనుగొన్న సంగతి తెలిసిందే. ఇక్కడ 5.9 మిలియన్‌ టన్నుల లిథియం నిల్వలున్నాయని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని