భారతీయ సంస్థలతో భాగస్వామ్యానికి ఐఏజీ కార్గో ఆసక్తి

భారత్‌లో వృద్ధి అవకాశాలపై సానుకూల ధోరణితో ఉన్న ఐరోపా దిగ్గజ సంస్థ ఐఏజీ కార్గో, ఇక్కడి క్యారియర్లు, లాజిస్టిక్స్‌ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు ఆసక్తిగా ఉంది. ఇక్కడి సంస్థల నుంచి సరైన

Published : 30 Nov 2023 02:13 IST

దిల్లీ: భారత్‌లో వృద్ధి అవకాశాలపై సానుకూల ధోరణితో ఉన్న ఐరోపా దిగ్గజ సంస్థ ఐఏజీ కార్గో, ఇక్కడి క్యారియర్లు, లాజిస్టిక్స్‌ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు ఆసక్తిగా ఉంది. ఇక్కడి సంస్థల నుంచి సరైన అవకాశం లభిస్తే కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఐఏజీ కార్గో సీఈఓ డేవిడ్‌ షెపర్డ్‌ వెల్లడించారు. ఐరోపాకు చెందిన ఐఏజీ కార్గో 5 విమానయాన సంస్థలకు సంబంధించిన సరకు రవాణా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ఎగుమతుల్లో భారత్‌ నుంచి ఈ సంస్థకు సుమారు 10 శాతం ఆదాయం లభిస్తోంది. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, ఐబెరియా కార్గోతో పాటు స్పానిష్‌ క్యారియర్లు వ్యూలింగ్‌, లెవెల్‌, ఐర్లండ్‌కు చెందిన ఎయిర్‌ లింగస్‌ కార్గోల వ్యాపారాన్ని ఐఏజీ కార్గో నిర్వహిస్తోంది. భారతీయ విపణి నుంచి అత్యధికంగా ఔషధ, ఇ-కామర్స్‌ రంగాల నుంచి సరకు రవాణా అవకాశాలు బాగున్నాయని, ఇక్కడి క్యారియర్లు, లాజిస్టిక్‌ సంస్థలతో భాగస్వామ్యంతో వృద్ధికి అవకాశాలు బాగున్నాయని డేవిడ్‌ వివరించారు. ప్రస్తుతం భారత్‌-యూకే మధ్య వారానికి 112 విమానాలను ఐఏజీ కార్గో నడుపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని