రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు మెరుగ్గానే ఉండొచ్చు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో మనదేశ వృద్ధి రేటు మెరుగ్గానే ఉండే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌ బుధవారం తెలిపారు.

Published : 30 Nov 2023 02:17 IST

ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో మనదేశ వృద్ధి రేటు మెరుగ్గానే ఉండే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌ బుధవారం తెలిపారు. రెండో త్రైమాసిక  జీడీపీ గణాంకాలు ఈనెల 30న (గురువారం) విడుదల కానున్నాయి. జూన్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ‘రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ మంచి ప్రదర్శనే కనబర్చింది. అందువల్ల గణాంకాలూ బాగానే ఉంటాయ’ని ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సేథ్‌ వెల్లడించారు. వచ్చే అయిదేళ్లకు ఆహార సబ్సిడీకి కేటాయింపును ప్రభుత్వం పెంచినప్పటికీ, ద్రవ్యలోటును 5.9 శాతం లోపునకు నియంత్రించాలనే లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని