డిజిటల్‌ లావాదేవీలు పెరిగినా నగదు దాచుకోవడం కొనసాగుతోంది

కొవిడ్‌-19 పరిణామాల అనంతరం డిజిటల్‌ లావాదేవీలు పుంజుకోవడం వల్ల, దేశంలో భౌతిక రూపంలో నగదు వినియోగానికి గిరాకీ నెమ్మదించింది. అయితే పొదుపు, అత్యవసరాల కోసం ముందుజాగ్రత్తగా దాచిపెట్టుకునే విషయంలో....

Published : 30 Nov 2023 02:19 IST

ఆర్‌బీఐ ఆర్థికవేత్తలు

దిల్లీ: కొవిడ్‌-19 పరిణామాల అనంతరం డిజిటల్‌ లావాదేవీలు పుంజుకోవడం వల్ల, దేశంలో భౌతిక రూపంలో నగదు వినియోగానికి గిరాకీ నెమ్మదించింది. అయితే పొదుపు, అత్యవసరాల కోసం ముందుజాగ్రత్తగా దాచిపెట్టుకునే విషయంలో మాత్రం ఇప్పటికీ నగదు వైపే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆర్థికవేత్తలు రూపొందించిన పరిశోధనా పత్రం వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ మరింతగా వృద్ధి చెందుతుండటంతో.. మున్ముందు నగదుకు గిరాకీ కూడా పెరుగుతుందని పేర్కొంది. ‘అత్యవసరాలు, భవిష్యత్తు కోసం నిల్వ చేసుకునే ఉద్దేశాల వల్ల నగదు గిరాకీలో స్థిరమైన వృద్ధి కనిపించొచ్చు. అయితే చెల్లింపుల కోసం మాత్రం నగదు వినియోగం తగ్గడం కొనసాగుతుంద’ని తాజా నివేదికలో ఆర్‌బీఐ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. 2022-23లో ప్రత్యామ్నాయ పెట్టుబడులపై తక్కువ ప్రతిఫలం కారణంగా.. నగదుకు గిరాకీ పెరిగేందుకు దోహదం చేసింది. కుటుంబాలు ముందస్తు జాగ్రత్త కోసం నగదు దాయడం, 2020-21లో స్థూల జాతీయ వినియోగ ఆదాయంలో 15.5 శాతానికి పెరిగింది. అంతకుముందు ఏడాదిలో ఇది 11.7 శాతంగా ఉంది. లావాదేవీల విషయంలో మాత్రం నగదు స్థానంలో డిజిటల్‌ రూపేణా వినియోగం పెరిగిందని నివేదిక విశ్లేషించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని