స్థిరాస్తిలోకి వచ్చే ఏడాది భారీ పెట్టుబడులు

ఆసియా పసిఫిక్‌ ప్రాంతం (ఏపీఏసీ)లో భారత్‌, దక్షిణ కొరియాలలోని వివిధ స్థిరాస్తి ప్రాజెక్టుల్లోకి విదేశీ పెట్టుబడులు వస్తాయని స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ కొలియర్స్‌ ఇండియా అంచనా వేసింది.

Published : 30 Nov 2023 02:22 IST

కొలియర్స్‌ ఇండియా నివేదిక

దిల్లీ: ఆసియా పసిఫిక్‌ ప్రాంతం (ఏపీఏసీ)లో భారత్‌, దక్షిణ కొరియాలలోని వివిధ స్థిరాస్తి ప్రాజెక్టుల్లోకి విదేశీ పెట్టుబడులు వస్తాయని స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ కొలియర్స్‌ ఇండియా అంచనా వేసింది. ఈ రెండు కీలక మార్కెట్లలో వృద్ధికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని అంతర్జాతీయ మదుపర్లు భావిస్తుండడమే ఇందుకు కారణమని ‘2024 గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ అవుట్‌లుక్‌’ నివేదికలో పేర్కొంది. అందులోని ముఖ్యాంశాలు..

  • భారత్‌, దక్షిణ కొరియా వంటి వృద్ధి ఆధారిత ప్రాంతాల స్థిరాస్తిలో అధిక కార్యకలాపాలు కనిపించొచ్చు. మదుపర్ల విశ్వాసం తిరిగి పుంజుకోవడం, అవకాశాలూ పెరుగుతుండటం ఇందుకు కారణాలుగా నిలవవచ్చు.
  • ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ కొనసాగుతుందని అంచనా. ఇందుకు ప్రైవేటు వినియోగం, మూలధన పెట్టుబడులు సహకరించొచ్చు.
  • 2023 తొలి తొమ్మిది నెలల్లో స్థిరాస్తిలోకి సంస్థాగత పెట్టుబడులు 27 శాతం పెరిగాయి.
  • పారిశ్రామిక, నివాస విభాగాల ఒప్పందాల్లో మంచి వృద్ధి కనిపిస్తోంది.
  • భారత డేటా కేంద్రాలపై సంస్థాగత మదుపర్లు దృష్టి సారించారు. వీటి నుంచి స్థిరాదాయం, అధిక ప్రతిఫలాలు వస్తుండడంతో పాటు, నియంత్రణల పరంగా మద్దతు లభిస్తుండడంతో 2020 నుంచి ఈ విభాగంలోకి 1.1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
  • మరింత మంది సంస్థాగత మదుపర్లు, నిధులు భారత్‌లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. డేటా కేంద్రాలతో పాటు కార్యాలయాలు, రవాణా వ్యవస్థలు, నివాస గృహాల వంటి పలు విభాగాల్లో పెట్టుబడి అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని