రూ.22 పెరిగిన వాణిజ్య సిలిండర్‌

హోటళ్లు, రెస్టారెంట్‌ వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోగ్రాముల గ్యాస్‌ సిలిండర్‌ ధర స్వల్పంగా పెరిగింది. ఈ సిలిండర్‌ ధర హైదరాబాద్‌లో రూ.2002 నుంచి రూ.22 పెరిగి రూ.2024 అయ్యింది.

Published : 02 Dec 2023 02:29 IST

హైదరాబాద్‌: హోటళ్లు, రెస్టారెంట్‌ వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోగ్రాముల గ్యాస్‌ సిలిండర్‌ ధర స్వల్పంగా పెరిగింది. ఈ సిలిండర్‌ ధర హైదరాబాద్‌లో రూ.2002 నుంచి రూ.22 పెరిగి రూ.2024 అయ్యింది. దిల్లీలో రూ.21 పెరిగి రూ.1,796.50కు, ముంబయిలో రూ.1749కు చేరింది. నవంబరు 16న ఈ సిలిండర్‌ ధరను తగ్గించిన విషయం తెలిసిందే.  ఇళ్లలో వినియోగించే 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఎటువంటి మార్పు చేయలేదు. వరుసగా 21న నెలా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.  

4.6% తగ్గిన విమాన ఇంధన ధర: విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరను మాత్రం ప్రభుత్వరంగ ఇంధన రిటైల్‌ సంస్థలు శుక్రవారం 4.6 శాతం తగ్గించాయి. దిల్లీలో కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ ధర రూ.1,11,344.92 నుంచి రూ.5,189.25 తగ్గి రూ.1,06,155.67కు చేరింది. వరుసగా రెండో నెలా ఏటీఎఫ్‌ ధరలు తగ్గడం గమనార్హం. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 శాతం వాటా ఏటీఎఫ్‌దే కావడం గమనార్హం. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా వీటి ధరల్లో మార్పులు చేస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని