డీప్‌ఫేక్‌ వీడియోలపై ఆసక్తి లేదు

డీప్‌ఫేక్‌ వీడియోలపై యూట్యూబ్‌కు ఎంతమాత్రం ఆసక్తి లేదని ఆ కంపెనీ ఇండియా డైరెక్టర్‌ ఇషాన్‌ జాన్‌ ఛటర్జీ పేర్కొన్నారు. తప్పుడు వార్తలు/సమాచారంతో అనుబంధం ఉండాలని మా భాగస్వాములెవరూ భావించడం లేదనీ తెలిపారు.

Published : 02 Dec 2023 02:41 IST

స్థానిక చట్టాలన్నిటినీ గౌరవిస్తున్నాం: యూట్యూబ్‌

దిల్లీ: డీప్‌ఫేక్‌ వీడియోలపై యూట్యూబ్‌కు ఎంతమాత్రం ఆసక్తి లేదని ఆ కంపెనీ ఇండియా డైరెక్టర్‌ ఇషాన్‌ జాన్‌ ఛటర్జీ పేర్కొన్నారు. తప్పుడు వార్తలు/సమాచారంతో అనుబంధం ఉండాలని మా భాగస్వాములెవరూ భావించడం లేదనీ తెలిపారు. కంపెనీ అన్ని స్థానిక చట్టాలను పాటిస్తుందని.. ఏదైనా సమస్య వచ్చిన పక్షంలో ప్రభుత్వానికి సహకరిస్తామని వివరించారు. ‘తప్పుడు సమాచారంపైనా, డీప్‌ఫేక్‌ వీడియోలపైనా మాకు ఏమాత్రం ఆసక్తి లేదు. మేం వీక్షకులు, క్రియేటర్లు, వ్యాపార ప్రకటనదార్లకు సేవలందిస్తాం. వీరిలో ఎవరూ తప్పుడు సమాచారంతో సంబంధం ఉండాలని కోరుకోవట్లేద’ని ఇషాన్‌ అన్నారు. 2022 అక్టోబరులో నోటిఫై చేసిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కొత్త నిబంధనలను సామాజిక మాధ్యమాలు పాటించడం లేదన్న కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వ్యాఖ్యలపై ఆయన పై విధంగా స్పందించారు. డీప్‌ఫేక్‌ వీడియోల విషయంలో కఠినంగా ఉండాలంటూ కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సామాజిక మాధ్యమాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. డీప్‌ఫేక్‌లను నిలువరించడానికి త్వరలోనే ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో వస్తుందని వైష్ణవ్‌ ఇదివరకే చెప్పారు.

 * తప్పుడీప్‌ఫేక్‌ వీడియోలపై ఆసక్తి లేదుడు సమాచారాన్ని ఇస్తున్న 78,000 వీడియోలను తొలగించినట్లు 2023 రెండో త్రైమాసిక నివేదికలో యూట్యూబ్‌ పేర్కొంది. అదే సమయంలో స్పామ్‌, స్కామ్స్‌ విధానాలను ఉల్లంఘించినందుకు 9,63,000 వీడియోలనూ తొలగించినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు