భారత ఆర్థిక భవితపై సీఎఫ్‌ఓలు ఆశావహం

దేశ ఆర్థిక భవిష్యత్తుపై 94 శాతం భారత కంపెనీల ముఖ్య ఆర్థిక అధికారులు (సీఎఫ్‌ఓ) విశ్వాసం వ్యక్తం చేశారని డెలాయిట్‌ ఇండియా పేర్కొంది.  ఆసియా పసిఫిక్‌ (అపాక్‌) ప్రాంతంలో ఇదే అత్యధిక ఆశావహ శాతమని వెల్లడించింది.

Published : 02 Dec 2023 03:00 IST

డెలాయిట్‌ ఇండియా సర్వే

దిల్లీ: దేశ ఆర్థిక భవిష్యత్తుపై 94 శాతం భారత కంపెనీల ముఖ్య ఆర్థిక అధికారులు (సీఎఫ్‌ఓ) విశ్వాసం వ్యక్తం చేశారని డెలాయిట్‌ ఇండియా పేర్కొంది.  ఆసియా పసిఫిక్‌ (అపాక్‌) ప్రాంతంలో ఇదే అత్యధిక ఆశావహ శాతమని వెల్లడించింది. సంస్థ తాజాగా ఆసియా పసిఫిక్‌ సీఎఫ్‌ఓ సర్వే 2023ను విడుదల చేసింది. భారత వృద్ధిపై 30 శాతానికి పైగా ఆసియా సీఎఫ్‌ఓలు ఆశావహ వైఖరి కనబరిచారు. 71 శాతం మంది జపాన్‌ సీఎఫ్‌ఓలు, 51 శాతం మంది ఆస్ట్రేలియా సీఎఫ్‌ఓలు, 49 శాతం మంది చైనా సీఎఫ్‌ఓలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశిత్చుల్లో భారత నాయకులు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన వ్యూహాలు సరైన ఫలితాన్ని ఇచ్చాయని భారత సీఎఫ్‌ఓలు అభిప్రాయపడ్డారు. ఆసియా పసిఫిక్‌లో 276 అగ్రగామి కంపెనీల సీఎఫ్‌ఓలు ఈ సర్వేలో పాల్గొన్నారు.

  •  భారత సీఎఫ్‌ఓలు ఆందోళన వ్యక్తం చేసిన అంశాల్లో అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం (59%), భౌగోళిక సమస్యలు (53 శాతం), డిజిటల్‌, టెక్నాలజీ అవాంతరాలు (27%) ఉన్నాయి. నైపుణ్యాలను కొనసాగించడం (59 శాతం), మార్కెట్లు లేదా ఉత్పత్తుల్లో ఇబ్బందులు (41%), టెక్నాలజీ అమలు/డిజిటల్‌ ఆటంకాలు (35%) కూడా ముప్పుగా మారొచ్చని పేర్కొన్నారు.
  •  సీఎఫ్‌ఓలు ప్రాధాన్యమిస్తున్న అంశాల్లో ఆదాయ వృద్ధి (73%), వ్యయ నియంత్రణ (47%),   ఉత్పాదకత మెరుగుదల (37%) ఉన్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని