జీఎస్‌టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు

నవంబరులో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 నవంబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.45 లక్షల కోట్ల కంటే ఇవి 15 శాతం అధికం. ‘2023 నవంబరులో స్థూలంగా రూ.1,67,929 కోట్ల జీఎస్‌టీ వసూలైంది.

Published : 02 Dec 2023 03:10 IST

 నవంబరులో 15% పెరిగాయ్‌

 దిల్లీ: నవంబరులో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 నవంబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.45 లక్షల కోట్ల కంటే ఇవి 15 శాతం అధికం. ‘2023 నవంబరులో స్థూలంగా రూ.1,67,929 కోట్ల జీఎస్‌టీ వసూలైంది. ఇందులో సీజీఎస్‌టీ    రూ.30,420 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.38,226 కోట్లు కాగా.. ఐజీఎస్‌టీ రూ.87,009 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలైన రూ.39,198 కోట్లతో కలిపి), సెస్సు రూ.12,274 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలైన రూ.1,036 కోట్లతో కలిపి)గా నమోదయ్యాయ’ని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఏడాది అక్టోబరులో నమోదైన రూ.1.72 లక్షల కోట్లతో పోలిస్తే నవంబరులో జీఎస్‌టీ వసూళ్లు తగ్గడం గమనార్హం. అక్టోబరు జీఎస్‌టీ వసూళ్లు, ఈ పన్నుల విధానంలో రెండో అత్యధిక మొత్తంగా నిలిచిన సంగతి తెలిసిందే. 2023-24లో నవంబరు వరకు చూస్తే, జీఎస్‌టీ వసూళ్లపరంగా ఏడాది వ్యవధిలో.. ఒక నెలలో అత్యధిక వృద్ధి 15 శాతమేనని ఆర్థిక శాఖ వివరించింది.

 తయారీ రంగమూ ముందుకే

 దిల్లీ: ఈ ఏడాది నవంబరులోనూ దేశీయ తయారీ రంగ జోరు కొనసాగింది. ధరల ఒత్తిళ్లు గణనీయ స్థాయిలో తగ్గడం, క్లయింట్ల నుంచి అధిక గిరాకీ నేపథ్యంలో మెరుగైన పనితీరు సాధ్యమైంది. 2024లోనూ ఈ జోరు కొనసాగే అవకాశం ఉందని ఓ సర్వే తెలిపింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) గత నెల 56 పాయింట్లకు పెరిగింది. అక్టోబరులో 6 నెలల కనిష్ఠమైన 55.5 పాయింట్లుగా నమోదైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు