డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ 13 నుంచి

పెన్సిల్‌ తయారీలో రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) డిసెంబరు 13న ప్రారంభమై 15న ముగియనుంది. ప్రతిపాదిత ఇష్యూలో భాగంగా రూ.350 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో మరో రూ.850 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు.

Published : 05 Dec 2023 03:57 IST

దిల్లీ: పెన్సిల్‌ తయారీలో రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) డిసెంబరు 13న ప్రారంభమై 15న ముగియనుంది. ప్రతిపాదిత ఇష్యూలో భాగంగా రూ.350 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో మరో రూ.850 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. తద్వారా మొత్తంగా రూ.1,200 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. సంస్థలో 51 శాతం వాటా ఉన్న ఇటలీ సంస్థ ఫిలా 2012 నుంచి రూ.300 కోట్లు పెట్టుబడిగా ఉంటుంది. ప్రతిపాదిత ఐపీఓలో ఈ సంస్థ తన వాటాను సుమారు రూ.800 కోట్లకు విక్రయించాలని అనుకుంటోంది. ఇక ప్రమోటర్‌ కుటుంబం కూడా  తమ వాటాను రూ.400 కోట్లకు విక్రయించనున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను అంబర్‌గ్రామ్‌ వద్ద కొత్త ప్లాంటు ఏర్పాటు కోసం కంపెనీ వాడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని