వినికిడి లోపం ఉన్నవారికి భారత్‌లో తొలి వీసా సమాచార కేంద్రం

వినికిడి లోపం ఉన్నవారు వీసా సేవల సమాచారాన్ని సులువుగా, స్వతంత్రంగా అందుకునేందుకు వీలు కల్పించేలా భారత్‌లో తొలి ‘సైన్‌ లాంగ్వేజ్‌ కాల్‌ సెంటర్‌’ను వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ ఆవిష్కరించింది.

Published : 05 Dec 2023 03:57 IST

వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ ఆవిష్కరణ

ముంబయి: వినికిడి లోపం ఉన్నవారు వీసా సేవల సమాచారాన్ని సులువుగా, స్వతంత్రంగా అందుకునేందుకు వీలు కల్పించేలా భారత్‌లో తొలి ‘సైన్‌ లాంగ్వేజ్‌ కాల్‌ సెంటర్‌’ను వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ ఆవిష్కరించింది. తొలి దశలో ఆస్ట్రియా, బల్గేరియా, క్రొయేషియా, సైప్రస్‌, డెన్మార్క్‌, ఎస్తోనియా, ఫిన్‌లాండ్‌, జర్మనీ, ఐస్‌లాండ్‌, ఇటలీ, లాట్వియా, నెదర్లాండ్స్‌, నార్వే, పోలాండ్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌లకు వెళ్లే వారికి సేవలందించనున్నట్లు ఒక ప్రకటనలో కంపెనీ పేర్కొంది. దశల వారీగా ఇతర దేశాలకూ వీటిని విస్తరించనున్నట్లు తెలిపింది.. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా(మేనా) ప్రాంతంలో వినికిడిలోపం ఉన్నవారు 24 దేశాలకు వెళ్లేందుకూ వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ వీసా సేవల సమాచారాన్ని అందిస్తోంది. ఈ ప్రాంతంలోని ఏడు దేశాల(బెహ్రెయిన్‌, ఇరాక్‌, కువైట్‌, లెబనాన్‌, ఖతర్‌, సౌదీ అరేబియా, యూఏఈ)కు చెందిన దరఖాస్తుదారులు ఈ సేవలను అందుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని