స్పాటిఫైలో 1,500 ఉద్యోగాల కోత

సంగీత స్ట్రీమింగ్‌ సేవలు అందిస్తున్న స్పాటిఫై, మరో విడతలో 1,500 మంది (17 శాతం) ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించింది.

Published : 05 Dec 2023 03:57 IST

లండన్‌: సంగీత స్ట్రీమింగ్‌ సేవలు అందిస్తున్న స్పాటిఫై, మరో విడతలో 1,500 మంది (17 శాతం) ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించింది. లాభదాయకంగా మారేందుకు, వ్యయాలు తగ్గించుకునేందుకు సిబ్బందిని తగ్గించుకున్నట్లు తెలిపింది. వ్యూహాత్మక రీఓరియెంటేషన్‌లో భాగంగా ఈ తొలగింపులు తప్పడం లేదని కంపెనీ సీఈఓ డేనియల్‌ ఏక్‌ ఉద్యోగులకు సమాచారమిచ్చారు. కచ్చితంగా ఎంత మందిని తొలగిస్తున్నదీ చెప్పకపోయినా, సుమారు 1,500 మంది వరకు ఉండొచ్చని కంపెనీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని