అంతరిక్ష అంకురాలకు నిధులు

పట్టణాభివృద్ధి, విపత్తు నిర్వహణ అంశాల్లో పనిచేస్తున్న అంతరిక్ష అంకురాలకు ప్రాథమిక నిధులను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) వెల్లడించింది.

Published : 05 Dec 2023 03:57 IST

ప్రత్యేక పథకాన్ని ప్రారంభించిన ఇన్‌-స్పేస్‌

ముంబయి: పట్టణాభివృద్ధి, విపత్తు నిర్వహణ అంశాల్లో పనిచేస్తున్న అంతరిక్ష అంకురాలకు ప్రాథమిక నిధులను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) వెల్లడించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన అంకురాలు.. ఆలోచన నుంచి నమూనాలను రూపొందించేందకు అవసరమైన పెట్టుబడిని అందించనుంది. ఇస్రోకు చెందిన మౌలిక వసతులను వాడుకోవడంతో పాటు, సమాచారం, మెంటార్‌షిప్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ (డీఓఎస్‌) నుంచి సాంకేతిక సహాయం తదితరాలూ అందుతాయి. అంకురాలకు రూ.కోటి వరకూ పెట్టుబడి సహాయం చేసే వీలుంది. అంతరిక్ష పరిశోధనలు, కార్యకలాపాల్లో ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించేందుకు ఇన్‌-స్పేస్‌ను ఏర్పాటు చేశారు. ఇది డీఓస్‌ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో అంతరిక్ష రంగమూ కీలకంగా మారుతోందని, అందుకే, ఇందులోకి వచ్చే సంస్థలను ప్రోత్సహించేందుకు ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఇన్‌-స్పేస్‌ ఛైర్మన్‌ పవన్‌ గోయంక తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని