ద్రవ్య లభ్యత పరిమితుల వల్లే వైజాగ్‌ స్టీల్‌ కార్మికుల వేతనాలు ఆలస్యం

ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీ అయిన ఆర్‌ఐఎన్‌ఎల్‌ (వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌) ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరులలో తమ కార్మికులకు వేతనాలను ఆలస్యంగా చెల్లించింది.

Updated : 05 Dec 2023 06:45 IST

రాజ్యసభలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫాగన్‌ సింగ్‌

దిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీ అయిన ఆర్‌ఐఎన్‌ఎల్‌ (వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌) ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరులలో తమ కార్మికులకు వేతనాలను ఆలస్యంగా చెల్లించింది. సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాల్సి ఉండగా, ద్రవ్య లభ్యత పరిమితుల వల్ల ఆయా నెలల్లో తొలి వారంలో చెల్లించినట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫాగన్‌ సింగ్‌ కులస్తే సోమవారం రాజ్యసభలో తెలిపారు. కొన్ని నెలలుగా వైజాగ్‌ ప్లాంటులో సామర్థ్య వినియోగం, ఉత్పత్తి తగ్గుతూ వస్తోందని గణాంకాలు ఉటంకించారు. ముడి పదార్థాల వ్యయాలు తగ్గించుకునేందుకు దేశీయ కోకింగ్‌ కోల్‌, థర్మల్‌ బొగ్గు సరఫరా చేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖను ఆర్‌ఐఎన్‌ఎల్‌ సంప్రదించిందని తెలిపారు. రిజర్వేషన్‌ పద్ధతిలో ఇనుప ఖనిజ బ్లాక్‌ కేటాయించాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో 7.2 ఎంటీపీఏ సామర్థ్యం ఉంది. వైర్‌ రాడ్‌ కాయిల్స్‌, రౌండ్లు, వివిధ గ్రేడ్లు, డైమెన్షన్ల బిల్లెట్స్‌ సహా ప్రత్యేక ఉక్కును కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని