వినియోగ బైక్‌ల వ్యాపారంలోకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌

మోటార్‌సైకిల్‌ తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తాజాగా వినియోగ (ప్రీ-ఓన్డ్‌) బైక్‌ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘రీఓన్‌’ పేరుతో ఈ వ్యాపారాన్ని నిర్వహించనుంది.

Published : 06 Dec 2023 02:14 IST

రీఓన్‌ పేరుతో కొత్త కంపెనీ

దిల్లీ: మోటార్‌సైకిల్‌ తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తాజాగా వినియోగ (ప్రీ-ఓన్డ్‌) బైక్‌ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘రీఓన్‌’ పేరుతో ఈ వ్యాపారాన్ని నిర్వహించనుంది. ప్రస్తుత రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌సైకిల్‌ వినియోగదార్లు తమ బైక్‌లను రీఓన్‌లో విక్రయించొచ్చు.  ఎవరైనా ఇక్కడ ప్రీఓన్డ్‌ బైక్‌లను కొనుగోలు చేయొచ్చు. మోటార్‌సైకిళ్ల మార్పిడి, అప్‌గ్రేడ్‌ సదుపాయాలూ ఇందులో ఉంటాయి. ‘ప్రీఓన్డ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌సైకిళ్లను వినియోగదార్లు విశ్వాసంతో కొనుగోలు చేయడం కోసమే రీఓన్‌ను తీసుకొచ్చిన’ట్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సీఈఓ బి.గోవిందరాజన్‌ పేర్కొన్నారు. సరికొత్త శ్రేణి వినియోగదార్లు రీఓన్‌కు తరలిరాగలరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రీఓన్‌ అవుట్‌లెట్లు దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైలలో అందుబాటులో ఉంటాయని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని