Rapido: క్యాబ్‌ సేవల విభాగంలోకి ర్యాపిడో

రైడ్‌ సేవలు అందించే ర్యాపిడో, క్యాబ్‌ సేవల విభాగంలోకి అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్‌ వంటి సంస్థలతో ర్యాపిడో పోటీపడనుంది.

Updated : 06 Dec 2023 08:03 IST

దిల్లీ: రైడ్‌ సేవలు అందించే ర్యాపిడో, క్యాబ్‌ సేవల విభాగంలోకి అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్‌ వంటి సంస్థలతో ర్యాపిడో పోటీపడనుంది. దిల్లీ- ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో దాదాపు 1.2 లక్షల క్యాబ్‌లతో ఈ సేవలను ర్యాపిడో ప్రారంభించింది. 2024 సెప్టెంబరుకు వీటిని 35 నగరాలకు విస్తరిస్తామని సంస్థ సహవ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి తెలిపారు. ఎక్కువ మంది ప్రజలకు యాప్‌ ఆధారిత సేవలు అందించి, మార్కెట్‌ విస్తరించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. సున్నా కమీషన్‌ మోడల్‌తో చోదకుల ఆదాయం పెంచుతామని, వినియోగదారులకు భారం తగ్గేలా చూస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు