1,14,902 అంకురాలకు గుర్తింపు

పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) అక్టోబరు 31 వరకు దేశంలోని 1,14,902 సంస్థలను అంకురాలుగా గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ లోక్‌సభలో బుధవారం వెల్లడించారు.

Published : 07 Dec 2023 01:28 IST

దిల్లీ: పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) అక్టోబరు 31 వరకు దేశంలోని 1,14,902 సంస్థలను అంకురాలుగా గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ లోక్‌సభలో బుధవారం వెల్లడించారు. ఈ సంస్థలు 2016 జనవరిలో ప్రారంభించిన స్టార్టప్‌ ఇండియా యాక్షన్‌ ప్లాన్‌ కింద ఆర్థిక ప్రోత్సాహకాలు పొందేందుకు అనుమతి పొందాయని తెలిపారు. వీటికి మూడేళ్ల పాటు ఆదాయపు పన్ను మినహాయింపు లభించినట్లు పేర్కొన్నారు.

రత్నాభరణాల పరిశ్రమకు సవాళ్లు: అమెరికా, హాంకాంగ్‌, పశ్చిమాసియా, చైనాల్లో గిరాకీ మందగించడం, పోటీ ధరలకు ముడి పదార్థాలు లభ్యం కాకపోవడంతో రత్నాభరణాల ఎగుమతుల పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొందని వాణిజ్య, పరిశ్రమల సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ తెలిపారు. రత్నాభరణాల ఎగుమతులు 39.27 బిలియన్‌ డాలర్ల నుంచి 2.95 శాతం క్షీణించి  2022-23లో 38.11 బి.డాలర్లకు పరిమితమయ్యాయి. టీవీలు, రేడియల్‌ టైర్ల వంటి దిగుమతులూ తగ్గాయని అనుప్రియ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని