పునరుత్పాదక ఇంధనాలపై అదానీ గ్రూప్‌ రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడి!

అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏజీఈఎల్‌) పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు, అదానీ గ్రూప్‌ 75 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6.23 లక్షల కోట్ల) పెట్టుబడి పెట్టబోతోందని గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ బుధవారం వెల్లడించారు.

Published : 07 Dec 2023 01:30 IST

దిల్లీ: అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఏజీఈఎల్‌) పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు, అదానీ గ్రూప్‌ 75 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6.23 లక్షల కోట్ల) పెట్టుబడి పెట్టబోతోందని గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ బుధవారం వెల్లడించారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 45 గిగావాట్లకు పెంచాలనే లక్ష్యంతో ఈ పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. ‘పెద్ద స్థాయి రెన్యూవబుల్స్‌, దేశీయ పూర్తి స్థాయి ఇంటిగ్రేటెడ్‌ తయారీ వ్యవస్థ, హరిత హైడ్రోజన్‌ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామ’ని అదానీ పేర్కొన్నారు. అమెరికాకు చెందిన మెర్కామ్‌ క్యాపిటల్‌ గ్రూప్‌ తాజా వార్షిక అంతర్జాతీయ నివేదికలో ఏజీఈఎల్‌ను రెండో అతి పెద్ద అంతర్జాతీయ సౌర పీవీ డెవలపర్‌గా గుర్తించింది. ఈ సంస్థ ఆపరేటింగ్‌ రెన్యూవబుల్‌ పోర్ట్‌ఫోలియో 8.4 గిగావాట్లుగా ఉంది. దేశీయంగా ఇదే అత్యధికం. 12 రాష్ట్రాల్లో 41 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ (సీఓ2) ఉద్గారాలను ఇది తగ్గిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని