ఎయిరిండియా విమానాల ఆర్డరులో మార్పులు

టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా, ఈ ఏడాది మొదట్లో ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌కు 250 విమానాలకు ఆర్డరు పెట్టింది.

Published : 07 Dec 2023 01:33 IST

ముంబయి: టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా, ఈ ఏడాది మొదట్లో ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌కు 250 విమానాలకు ఆర్డరు పెట్టింది. ఆ సంఖ్యలో మార్పు లేకున్నా.. అందులోని విమానాల కూర్పు విషయంలో తాజాగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

అప్పట్లో: 250 విమానాల్లో 210 తక్కువ వెడల్పు ఉన్న (నారోబాడీ) ఏ320 విమానాలు (ఇందులో 140 ఏ320నియో, 70 ఏ321నియో) ఉండగా.. మిగతా 40 పెద్ద (వైడ్‌బాడీ) విమానాలు (6 ఏ350-900, 34 ఏ350-1000) ఉన్నాయి.

ఇపుడు: 140 ఏ321నియో, 70 ఏ320నియో విమానాలతో పాటు 20 ఏ350-900, 20 ఏ350-1000 విమానాలకు ఆర్డరును సవరించిందని సమాచారం.

ఈ విషయంపై ఎయిరిండియా ప్రతినిధిని సంప్రదించగా..‘మేం ఎప్పటికప్పుడు మా వ్యాపారావసరాలకు తగ్గట్లుగా ఆర్డరు పుస్తకాన్ని సమీక్షిస్తుంటామ’ని పేర్కొన్నారు. ఎయిర్‌బస్‌ స్పందిస్తూ..‘మా వినియోగదార్ల వ్యాపార వ్యూహాలకు అనుగుణంగా, వారు మార్పులను కోరుతుంటార’ని తెలిపింది.

ఎయిరిండియా పెట్టిన 220 బోయింగ్‌ విమానాల విషయంలో ప్రస్తుతానికి మార్పు లేదని తెలుస్తోంది. ఇందులో 737 మాక్స్‌ చిన్న విమానాలు 190, 20 బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్లు, 10 బోయింగ్‌ 777ఎక్స్‌ విమానాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని