భారత్‌ 8% వృద్ధి సాధిస్తుంది

మన ఆర్థిక వ్యవస్థకు 8 శాతం వృద్ధి సాధించే సత్తా ఉందని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సుమన్‌ బెర్రీ పేర్కొన్నారు. కార్మిక శక్తి బలంగా ఉండటంతో పాటు ప్రజాస్వామ పరంగా సంస్థాగత అనుభవం ఉందని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తర భారతదేశం అంతగా రాణించడం లేదని, సార్వభౌమ వ్యవస్థలో ఇది ఉద్రిక్తతలను సృష్టించొచ్చని అన్నారు.

Published : 08 Dec 2023 01:27 IST

నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సుమన్‌ బెర్రీ

దిల్లీ: మన ఆర్థిక వ్యవస్థకు 8 శాతం వృద్ధి సాధించే సత్తా ఉందని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సుమన్‌ బెర్రీ పేర్కొన్నారు. కార్మిక శక్తి బలంగా ఉండటంతో పాటు ప్రజాస్వామ పరంగా సంస్థాగత అనుభవం ఉందని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తర భారతదేశం అంతగా రాణించడం లేదని, సార్వభౌమ వ్యవస్థలో ఇది ఉద్రిక్తతలను సృష్టించొచ్చని అన్నారు. సీఐఐ, ఆర్థిక శాఖ నిర్వహించిన గ్లోబల్‌ ఎకనామిక్‌ పాలసీ ఫోరమ్‌ 2023లో ఆయన మాట్లాడారు. భారత వంటి దేశాల్లో ఆర్థికాభివృద్ధి చాలా కీలకమన్నారు. వృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని