పంచదార ధరల అదుపునకు చర్యలు

దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్‌ ఉత్పత్తికి చెరకు రసం వినియోగించకుండా నిషేధం విధిస్తూ, చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశీయ అవసరాలకు తగినంత చక్కెరను అందుబాటులో ఉంచడంతో పాటు, ధరలు అదుపులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.

Updated : 08 Dec 2023 02:48 IST

ఇథనాల్‌ ఉత్పత్తిలో చెరకు రసం వినియోగంపై నిషేధం

దిల్లీ: దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్‌ ఉత్పత్తికి చెరకు రసం వినియోగించకుండా నిషేధం విధిస్తూ, చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశీయ అవసరాలకు తగినంత చక్కెరను అందుబాటులో ఉంచడంతో పాటు, ధరలు అదుపులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. చెరకు ప్రధానంగా పండించే రాష్ట్రాల్ల్లో ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో..ఈనెల నుంచి ప్రారంభమయ్యే 2023-24 సరఫరా సీజన్‌లో పంచదార ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. అందువల్ల ఇప్పటినుంచే చక్కెర ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా చక్కెరను అందుబాటులో ఉంచి, ధరల్ని అదుపు చేయాలన్న ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఇథనాల్‌ తయారీకి చెరకు రసాన్ని, షుగర్‌ సిరప్‌ వాడకాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని