2025కు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 170 గిగా వాట్లకు: ఇక్రా

దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2025 నాటికి  170 గిగా వాట్లకు చేరుకుంటుందని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌, సెక్టార్‌ హెడ్‌ - కార్పొరేట్‌ రేటింగ్స్‌ వి.విక్రమ్‌ అంచనా వేశారు. ప్రస్తుతం దేశీయ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 130 గిగా వాట్లుగా ఉంది.

Published : 08 Dec 2023 01:39 IST

దిల్లీ: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2025 నాటికి  170 గిగా వాట్లకు చేరుకుంటుందని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌, సెక్టార్‌ హెడ్‌ - కార్పొరేట్‌ రేటింగ్స్‌ వి.విక్రమ్‌ అంచనా వేశారు. ప్రస్తుతం దేశీయ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 130 గిగా వాట్లుగా ఉంది. బలమైన విధాన మద్దతు, సౌర మాడ్యూళ్ల ధరలు అందుబాటులోకి రావడంతో, 2025 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 170 గిగా వాట్లకు చేరుతుందని విక్రమ్‌ పేర్కొన్నారు. గత 12 నెలల్లో సౌర పీవీ సెల్‌, మాడ్యూళ్ల ధరలు వరుసగా 65 శాతం, 50 శాతం  తగ్గాయని వివరించారు. రాబోయే సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు ఆరోగ్యకర వృద్ధిని సాధించేందుకు ఇది దోహదం చేయనుందని అభిప్రాయపడ్డారు. 2023 మార్చిలో ప్రభుత్వం ప్రకటించిన 50 గిగా వాట్ల వార్షిక బిడ్డింగ్‌లో భాగంగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 16 గిగా వాట్లకు పైగా ప్రాజెక్టుల టెండరింగ్‌ కార్యకలాపాలు పూర్తయ్యాయి. మరో 17 గిగా వాట్ల బిడ్లు కేంద్ర నోడల్‌ ఏజెన్సీల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని