Tech Mahindra: ప్రాంగణ ఎంపికలు చేపడతాం

ఈ ఏడాదిలో కళాశాలలను సందర్శించి, ప్రాంగణ నియామకాలు (ఫ్రెషర్లు) చేపడతామని  టెక్‌ మహీంద్రా సీఈఓ మిలింద్‌ జోషి జోషి స్పష్టం చేశారు.

Updated : 25 Jan 2024 08:11 IST

ముంబయి: ఈ ఏడాదిలో కళాశాలలను సందర్శించి, ప్రాంగణ నియామకాలు (ఫ్రెషర్లు) చేపడతామని  టెక్‌ మహీంద్రా సీఈఓ మిలింద్‌ జోషి జోషి స్పష్టం చేశారు. సెప్టెంబరు చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,50,604గా ఉండగా.. డిసెంబరు ఆఖరుకు 1,46,250కు తగ్గిందని, డిసెంబరు త్రైమాసిక ఫలితాల సందర్భంగా తెలిపారు. అక్టోబరు-డిసెంబరులో టెక్‌ మహీంద్రా నికర లాభం రూ.510.4 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదేకాల లాభం రూ.1296.6 కోట్లతో పోలిస్తే ఇది 60% తక్కువ.  ఆపరేటింగ్‌ లాభాల మార్జిన్లు 12% నుంచి 5.4 శాతానికి తగ్గడం ఇందుకు కారణం. కార్యకలాపాల ఆదాయం 4.6% తగ్గి రూ.13,101 కోట్లకు పరిమితమైంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కొత్త ఒప్పందాలు 381 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. సంస్థాగత మార్పులను ఏప్రిల్‌లో వెల్లడిస్తామని, కొత్త ఆర్డర్లు పుంజుకోవడానికి 6-9 నెలల సమయం పట్టొచ్చని జోషి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని