సీఎంఆర్‌ ప్రచారకర్తగా మృణాల్‌

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో వస్త్ర, స్వర్ణాభరణాల విక్రయశాలలను నిర్వహిస్తున్న సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌కు మరో ప్రచారకర్తగా సినీ నటి మృణాల్‌ ఠాకూర్‌ నియమితులయ్యారు.

Published : 23 Feb 2024 03:07 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో వస్త్ర, స్వర్ణాభరణాల విక్రయశాలలను నిర్వహిస్తున్న సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌కు మరో ప్రచారకర్తగా సినీ నటి మృణాల్‌ ఠాకూర్‌ నియమితులయ్యారు. ఇప్పటికే సినీ నటుడు రామ్‌ పోతినేని ఈ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నారు. వస్త్ర, స్వర్ణాభరణాల రంగంలో 40 సంవత్సరాలుగా ప్రత్యేకత చూపుతూ, వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా అద్భుత డిజైన్లను సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ అందిస్తోందని మృణాల్‌ ఠాకూర్‌ తెలిపారు. తమ సంస్థకు మృణాల్‌ ఠాకూర్‌ ప్రచారకర్తగా ఉండటం తమకెంతో సంతోషకరమని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మావూరి మోహన్‌ బాలాజీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని