ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు భారీ ఆర్డర్‌

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌, ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బృందం (కన్సార్టియమ్‌), బీఈఎస్‌టీ (బృహన్‌ ముంబయి ఎలక్ట్రిక్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్‌) నుంచి 2,400 విద్యుత్తు బస్సుల సరఫరా ఆర్డర్‌ సంపాదించింది.

Published : 23 Feb 2024 03:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌, ఈవీ ట్రాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బృందం (కన్సార్టియమ్‌), బీఈఎస్‌టీ (బృహన్‌ ముంబయి ఎలక్ట్రిక్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్‌) నుంచి 2,400 విద్యుత్తు బస్సుల సరఫరా ఆర్డర్‌ సంపాదించింది. ఈ బస్సుల కార్యకలాపాల నిర్వహణ, మెయింటెనెన్స్‌ బాధ్యతలు కూడా ఒలెక్ట్రా కన్సార్షియమ్‌ నిర్వహిస్తుంది. గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు/ఆపెక్స్‌ పద్ధతిలో 12 ఏళ్ల కాలానికి ఈ ఆర్డర్‌ లభించినట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ వెల్లడించింది. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ తయారు చేసే విద్యుత్తు బస్సులను ఈవీ ట్రాన్స్‌ తీసుకుని బీఈఎస్‌టీకి అందజేస్తుంది. 18 నెలల వ్యవధిలో సరఫరా చేయాల్సిన ఈ బస్సుల విలువ రూ.4,000 కోట్ల వరకు ఉంటుందని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని