ఒక్కరోజే రూ.22 లక్షల కోట్ల లాభం

అమెరికా చిప్‌తయారీ కంపెనీ ఎన్‌విడియా షేరు ప్రభంజనం సృష్టించింది. గురువారం రాత్రి షేరు 16% పెరగడంతో, ఎన్‌విడియా మార్కెట్‌ విలువ ఒక్కరోజే 277 బిలియన్‌ డాలర్లు (రూ.22 లక్షల కోట్ల పైనే) అధికమై 1.96 లక్షల కోట్ల డాలర్ల (రూ.160 లక్షల కోట్లు)కు చేరింది.

Published : 24 Feb 2024 02:26 IST

ఎన్‌విడియా షేరు ప్రభంజనం

వాషింగ్టన్‌: అమెరికా చిప్‌తయారీ కంపెనీ ఎన్‌విడియా షేరు ప్రభంజనం సృష్టించింది. గురువారం రాత్రి షేరు 16% పెరగడంతో, ఎన్‌విడియా మార్కెట్‌ విలువ ఒక్కరోజే 277 బిలియన్‌ డాలర్లు (రూ.22 లక్షల కోట్ల పైనే) అధికమై 1.96 లక్షల కోట్ల డాలర్ల (రూ.160 లక్షల కోట్లు)కు చేరింది. మనదేశ అగ్రగామి సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొత్తం మార్కెట్‌ విలువ రూ.20.21 లక్షల కోట్లు కాగా, ఎన్‌విడియో మార్కెట్‌ విలువ ఒక్కరోజే అంతకుమించి పెరగడం గమనార్హం. త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో ఎన్‌విడియా రాణించడమే ఇందుకు కారణం. ఈనెల 2న మెటా ప్లాట్‌ఫామ్స్‌ ఒక్కరోజు లాభం 196.8 బిలియన్‌ డాలర్ల రికార్డును ఇది తుడిచేసింది. మార్కెట్‌ విలువ పరంగా అమెజాన్‌, ఆల్ఫాబెట్‌లను అధిగమించి అమెరికాలోనే నాలుగో అత్యంత విలువైన కంపెనీగా ఎన్‌విడియా అవతరించింది. మైక్రోసాఫ్ట్‌ 3.06 లక్షల కోట్ల డాలర్లు, , యాపిల్‌ 2.85 లక్షల కోట్ల డాలర్లు, సౌదీఆరామ్‌కో 2.065 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువతో ఎన్‌విడియా కంటే ముందున్నాయి. మన కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రికి ఎన్‌విడియా మార్కెట్‌ విలువ ------- లక్షల కోట్ల డాలర్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని