ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల కోట్ల ఆదాయం

హరిత విద్యుత్‌, పర్యావరణ పరిష్కారాలను అందించే థర్మాక్స్‌ మూడేళ్లుగా 25% వృద్ధిని నమోదు చేస్తోందని ఆ సంస్థ ఎండీ, సీఈఓ ఆశిష్‌ భండారి తెలిపారు.

Published : 24 Feb 2024 02:29 IST

థర్మాక్స్‌ ఎండీ, సీఈఓ ఆశిష్‌ భండారి

హైదరాబాద్‌ (రాయదుర్గం), న్యూస్‌టుడే: హరిత విద్యుత్‌, పర్యావరణ పరిష్కారాలను అందించే థర్మాక్స్‌ మూడేళ్లుగా 25% వృద్ధిని నమోదు చేస్తోందని ఆ సంస్థ ఎండీ, సీఈఓ ఆశిష్‌ భండారి తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం సంస్థ సరికొత్త ఆవిష్కరణలు, హరిత పరిష్కారాలను ప్రదర్శించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం రూ.10వేల కోట్లకు చేరుకుంటుందని ఆశిష్‌ పేర్కొన్నారు. ఔషధరంగం, దుస్తులు, నీటి శుద్ధి, సిమెంట్‌, ఆహార పరిశ్రమలకు కావాల్సిన పునరుత్పాదక విద్యుత్‌ శక్తి, ఇంధన పొదుపు సేవలను తమ సంస్థ అందిస్తున్నట్లు తెలిపారు. 15 రంగాల్లో వందల ఉత్పత్తులను అందిస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాల నుంచి విద్యుత్‌ తయారీ, శీతలీకరణ, నీటి పునర్వినియోగ సాధనాలు, కూలింగ్‌ టవర్లలాంటివి ఏర్పాటు చేస్తామని చెప్పారు. హరిత భవనాలకు కావాల్సిన అన్ని ఉత్పత్తులూ తాము తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. శ్రీసిటీలో తమకు ప్లాంటు ఉందని, చెన్నైలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రం ఉందని తెలిపారు. పరిశ్రమలు పర్యావరణహితంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఇది ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఒకసారి వీటిని ఏర్పాటు చేసుకుంటే, పరిశ్రమ నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు