ఆర్‌బీఐతో వ్యాపారుల వివరాలను జీఎస్‌టీఎన్‌ పంచుకోవచ్చు

జీఎస్‌టీ నమోదిత వ్యాపారుల వివరాలను వారి సమ్మతితో రిజర్వ్‌ బ్యాంక్‌కు చెందిన ‘పబ్లిక్‌ టెక్‌ ప్లాట్‌ఫామ్‌ ఫర్‌ ఫ్రిక్షన్‌లెస్‌ క్రెడిట్‌’తో జీఎస్‌టీ నెట్‌వర్క్‌ పంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

Published : 24 Feb 2024 02:32 IST

వారి సమ్మతి మేరకే: ప్రభుత్వం

దిల్లీ: జీఎస్‌టీ నమోదిత వ్యాపారుల వివరాలను వారి సమ్మతితో రిజర్వ్‌ బ్యాంక్‌కు చెందిన ‘పబ్లిక్‌ టెక్‌ ప్లాట్‌ఫామ్‌ ఫర్‌ ఫ్రిక్షన్‌లెస్‌ క్రెడిట్‌’తో జీఎస్‌టీ నెట్‌వర్క్‌ పంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇలా పంచుకున్న జీఎస్‌టీ ఆధారిత సమాచారం ఆధారంగా, వ్యాపార సంస్థలు మరింత వేగంగా రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. రుణాల మంజూరులో తోడ్పడేందుకు రుణ సంస్థలకు అవసరమైన సమాచారాన్ని సులభంగా చేరవేసే ఉద్దేశంతో ఫ్రిక్షన్‌లెస్‌ క్రెడిట్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆర్‌బీఐ అనుబంధ సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌తో జీఎస్‌టీ నెట్‌వర్క్‌ పోర్టల్‌ సమాచారాన్ని పంచుకోవచ్చని, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) వెల్లడించింది. డిజిటల్‌ రూపేణా వివిధ మార్గాల్లో సమాచారాన్ని పొందేందుకు ఓ రుణ సంబంధిత వ్యవస్థను నిర్వహించడంలో భాగంగా ఈ  ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. రుణ సేవల సంస్థలు, డేటా సేవలు అందించే సంస్థలు ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా పరస్పర సహకారం అందించుకోవచ్చని సీబీఐసీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని