జీమెయిల్‌ మూసివేస్తారంటూ ప్రచారం

గూగుల్‌కు చెందిన ఇ-మెయిల్‌ సర్వీస్‌ జీమెయిల్‌ సేవలను నిలిపివేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

Published : 25 Feb 2024 02:18 IST

సేవలు యథాతథంగా కొనసాగుతాయని గూగుల్‌ స్పష్టత

గూగుల్‌కు చెందిన ఇ-మెయిల్‌ సర్వీస్‌ జీమెయిల్‌ సేవలను నిలిపివేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఈ సేవలు నిలిచిపోనున్నాయన్నది ఆ పోస్టుల సారాంశం. దీనిపై గూగుల్‌ స్పష్టత ఇచ్చింది. ఈ సేవలు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది. జీమెయిల్‌ త్వరలో మూతపడబోతోందని, 2024 ఆగస్టు 1 నుంచి ఈ సర్వీసులు నిలిచిపోనున్నాయంటూ ఓ స్క్రీన్‌షాట్‌ సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. దీంతో చాలామంది జీమెయిల్‌ వినియోగదార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నకిలీ ప్రచారంపై గూగుల్‌ స్పందించింది. జీమెయిల్‌ అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా ‘ఈ సేవలు కొనసాగుతాయి’ అంటూ ఓ పోస్ట్‌ పెట్టింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచి జీమెయిల్‌ తన హెచ్‌టీఎంఎల్‌ వెర్షన్‌ సర్వీసులను మాత్రమే నిలిపివేసింది. నెట్‌వర్క్‌ సరిగా లేని సమయంలోనూ ఇ-మెయిల్స్‌ పొందడం ఈ సర్వీసుల ఉద్దేశం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు