వినోద రంగం రిటైల్‌ స్థలాల లీజింగ్‌

సినిమాలు, గేమింగ్‌ జోన్లు కలిసి ఉన్న వినోద రంగం గత ఏడాది 6.6 లక్షల చదరపు అడుగుల రిటైల్‌ స్థలాలను లీజుకు అందించిందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది.

Published : 25 Feb 2024 02:19 IST

6.6 లక్షల చదరపు అడుగులు
మొత్తం లీజింగ్‌లో 9 శాతం వాటా
2023లో 7 ప్రధాన నగరాలపై సీబీఆర్‌ఈ నివేదిక

దిల్లీ: సినిమాలు, గేమింగ్‌ జోన్లు కలిసి ఉన్న వినోద రంగం గత ఏడాది 6.6 లక్షల చదరపు అడుగుల రిటైల్‌ స్థలాలను లీజుకు అందించిందని స్థిరాస్తి కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో షాపింగ్‌ మాల్స్‌, హై-స్ట్రీట్స్‌లో రిటైల్‌ స్థలాల లీజింగ్‌ వివరాలను ఇందులో పేర్కొంది. వినోద రంగ లీజింగ్‌ 2022లో 2.4 లక్షల చదరపు అడుగులు కాగా, 2023లో 179 శాతం వృద్ధితో 6.6 లక్షల చ.అ.కు చేరిందని తెలిపింది. 2023లో మొత్తం రిటైల్‌ స్థలాల లీజింగ్‌లో వినోద రంగ వాటా 9 శాతంగా నమోదైంది. అంత క్రితం ఏడాది ఇది 5 శాతమే. నగరాల వారీగా చూస్తే బెంగళూరులో 3.3 లక్షల చ.అ. లీజింగ్‌ నమోదైంది. పీవీఆర్‌, బౌన్స్‌ ఇంక్‌, స్కై జంపర్‌, ఫన్‌ సిటీలు రిటైల్‌ స్థలాలను లీజుకు తీసుకున్నాయి. 2022లో ఈ నగరంలో 1.7 లక్షల చ.అ. లీజింగ్‌ నమోదైంది. చెన్నైలో 1.1 లక్షల చ.అ. లీజింగ్‌ కార్యకలాపాలు జరిగాయి. టైమ్‌జోన్‌, పీవీఆర్‌, ప్లే ఎన్‌ లెర్న్‌, నాసా, ఎల్‌ఈడీ, హామ్లేస్‌ ప్లే, ఎయిర్‌బోర్న్‌లు రిటైల్‌ స్థలాలను అద్దెకు తీసుకున్నాయి. దిల్లీ-ఎన్‌సీఆర్‌లో 70,000 చ.అ., ముంబయిలో 60,000 చ.అ. లీజింగ్‌ జరిగింది. ఐనాక్స్‌, సినీపొలిస్‌ వంటి బ్రాండ్లు అద్దెకు తీసుకున్నాయి. పుణెలో 50,000 చ.అ., అహ్మదాబాద్‌లో 30,000 చ.అ., హైదరాబాద్‌లో 10,000 చ.అ. మేర రిటైల్‌ స్థలాలను ప్రముఖ బ్రాండ్లు అద్దెకు తీసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని