లోకల్‌ ట్రైన్‌లో నిర్మలా సీతారామన్‌ ప్రయాణికులతో సెల్ఫీలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ముంబయి లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించారు.

Published : 25 Feb 2024 02:37 IST

ముంబయి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ముంబయి లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించారు. ఆమె ఘట్‌కోపర్‌ నుంచి కళ్యాణ్‌ వరకు రైలులో ప్రయాణిస్తూ, ప్రయాణికులతో ముచ్చటించినట్లు ఆమె కార్యాలయం అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది. అందులో ఆమె యువతతో ఉత్సాహంగా మాట్లాడుతూ సెల్ఫీలకు పోజులిస్తూ కనిపించారు. ఈ సందర్భంగా రైల్వే సదుపాయాలు, సేవల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. రైళ్లలో రద్దీ, మౌలిక సదుపాయాల కల్పనపై చర్యలు తీసుకోవాలని వారు ఆమెను కోరారు. గతేడాది ముంబయి మెట్రోలో కొత్త సేవలను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ సైతం  గుండావలి, మోగ్రా స్టేషన్ల మధ్య ప్రయాణించారు. ఆయనతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌, డిప్యూటీ సీఎం ఫడణవీస్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని