నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగాలు లభించకపోవడమే అసలు సమస్య

మన దేశంలో నిరుద్యోగం అనేది పెద్ద సమస్య కాదని, నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగం లభించడం లేదా తమ అవసరాలకు తగ్గ ఉద్యోగం లభించడమే ప్రధాన సమస్య అని 16వ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌, నీతి ఆయోగ్‌ మాజీ ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియా వెల్లడించారు.

Published : 25 Feb 2024 02:38 IST

16వ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియా

ముంబయి: మన దేశంలో నిరుద్యోగం అనేది పెద్ద సమస్య కాదని, నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగం లభించడం లేదా తమ అవసరాలకు తగ్గ ఉద్యోగం లభించడమే ప్రధాన సమస్య అని 16వ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌, నీతి ఆయోగ్‌ మాజీ ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియా వెల్లడించారు. ఏబీపీ నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఐడియాస్‌ ఆఫ్‌ ఇండియా సమ్మిట్‌ 3.0’ రెండు రోజుల ముగింపు కార్యక్రమంలో ‘ద ఎకనమిక్‌ విస్పర్‌: హౌ టు ఫ్యూయెల్‌ గ్రోత్‌ విత్‌ జాబ్స్‌’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. రాబోయే పదేళ్లలో దేశంలో ఉద్యోగాల సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నా దృష్టిలో నిరుద్యోగం అనేది మన దేశంలో పెద్ద సమస్య కాదు. నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగాలు లభించడం లేదు. అందువల్లే ఉత్పాదకత తక్కువగా ఉంటోంది. అందుకే అధిక ఉత్పాదకత ఉండే మంచి వేతనం చెల్లించే ఉద్యోగాలను సృష్టించడమే ప్రస్తుతం పెద్ద సవాలు’ అని అరవింద్‌ పేర్కొన్నారు. దేశంలో జనాభా అధికంగా ఉండటమే కాకుండా వారిలో యువతే ఎక్కువగా ఉండటం బాగా కలిసొచ్చే అంశమని తెలిపారు. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత సరళీకృత విధానాల వైపు అడుగులు పడ్డాయన్నారు. కొవిడ్‌ వచ్చిన సంవత్సరాలను తీసేస్తే గత 20 ఏళ్లలో 8.8 శాతం చొప్పున (వాస్తవిక డాలర్లలో) వృద్ధి చెందామని, 1980ల్లో దీన్ని ఊహించడం కూడా కష్టంగానే ఉండేదని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని