వద్దంటున్నా.. వస్తున్నాయ్‌!

‘మేము ఫలానా బ్యాంక్‌/ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ)/ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు లోన్‌/క్రెడిట్‌కార్డు మంజూరైంది. ఆకర్షణీయ బీమా పాలసీ మీ కోసమే ఉంది.

Published : 25 Feb 2024 02:39 IST

డీఎన్‌డీలో నమోదు చేసుకున్నా ఆగని అవాంఛిత కాల్స్‌: లోకల్‌ సర్కిల్స్‌

‘మేము ఫలానా బ్యాంక్‌/ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ)/ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు లోన్‌/క్రెడిట్‌కార్డు మంజూరైంది. ఆకర్షణీయ బీమా పాలసీ మీ కోసమే ఉంది. తీసుకుంటారా’ అనో.. ‘స్థిరాస్తి వెంచర్లున్నాయ్‌.. ఫ్లాట్‌/ప్లాట్‌ కొంటారా’ అనో ప్రతిరోజూ కాల్స్‌ ప్రతి మొబైల్‌కు వస్తూనే ఉన్నాయ్‌.

మనకు సంబంధం లేని, పరిచయం లేని వారి నుంచి వచ్చే ఇలాంటి అవాంఛిత కాల్స్‌ను ఆపేందుకు ‘డు నాట్‌ డిస్ట్రబ్‌’ (డీఎన్‌డీ) వ్యవస్థను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తీసుకొచ్చింది. ఇందులో నమోదు చేసుకుంటే, వాణిజ్య సంస్థల నుంచి వచ్చే కాల్స్‌ అన్నీ ఆగిపోవాలి. ‘అయితే డీఎన్‌డీలో నమోదైనా కూడా, పరిచయం లేని నంబర్ల నుంచి అవాంఛిత కాల్స్‌’ వస్తూనే ఉన్నాయని లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో అభిప్రాయాలు తెలిపిన వారిలో 90% మంది చెప్పారు. అధికారికంగా నమోదైన వాణిజ్య నంబర్ల నుంచి కాకుండా, వ్యక్తిగత నంబర్ల నుంచి ఇలాంటి కాల్స్‌ వస్తున్నాయని అత్యధికులు తెలిపారు. 378 జిల్లాల్లోని 60,000 మంది నుంచి 2023 నవంబరు 15 నుంచి ఈనెల 16 మధ్య సేకరించిన అభిప్రాయాల ప్రకారం..

  • ప్రతిరోజూ 1-2 అవాంఛిత కాల్స్‌ వస్తున్నాయని 90% మంది చెప్పారు. రోజుకు 10కి పైగా ఇలాంటి కాల్స్‌ వస్తున్నాయని 3% మంది పేర్కొన్నారు. డీఎన్‌డీలో నమోదైనా వాణిజ్యపరమైన కాల్స్‌ తమ మొబైల్‌ నంబరుపై గత 12 నెలలుగా వస్తున్నట్లు 90% మంది వెల్లడించారు.
  • వివిధ కంపెనీలు/బ్రాండ్ల పేరిట వస్తున్న అవాంఛిత కాల్స్‌ శాతం 2023 ఫిబ్రవరిలో 29% కాగా, ఈ నెలలో ఇవి 36 శాతానికి చేరాయని లోకల్‌ సర్కిల్స్‌ వ్యవస్థాపకుడు సచిన్‌ తపారియా వివరించారు.
  •  ఇలాంటి కాల్స్‌లో 40% ఒక దిగ్గజ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ, మరో అగ్రగామి ప్రైవేటు బ్యాంకు తరఫునే వస్తున్నట్లు చెప్పారు. ఇవి రెండూ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైనవే కావడం గమనార్హం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని