అనంత్‌ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలకు విలాస టెంట్‌లు

భారత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది.

Updated : 26 Feb 2024 07:03 IST

దిల్లీ: భారత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. జులైలో పెళ్లి జరగనుండగా, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ముందస్తు పెళ్లి వేడుకలను నిర్వహించనున్నారు. ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీలకు ముగ్గురు సంతానంలో చిన్నవాడు అనంత్‌ అంబానీ. ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌, వ్యాపారవేత్త శైలా మర్చంట్‌ దంపతుల చిన్న కుమార్తె రాధికా మర్చంట్‌ను అనంత్‌ పెళ్లి చేసుకోనున్నారు. అయితే జామ్‌నగర్‌లో 5 స్టార్‌ హోటళ్లు లేకపోవడంతో.. అల్ట్రా- లగ్జరీ టెంట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అతిధుల కోసం ఏర్పాటు చేసే ఈ టెంట్‌ల్లో టైల్డ్‌ బాత్‌రూమ్‌లు సహా సర్వసదుపాయాలు ఉంటాయి. ముందస్తు వివాహ వేడుకలకు ఆహ్వానాలు అందినవారిలో బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ తెందుల్కర్‌, ఎంఎస్‌ ధోనీ ఉన్నారు.

  • అతిథుల్లో మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌, అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌, వాల్ట్‌ డిస్నీ సీఈఓ బాబ్‌ ఐగర్‌, బ్లాక్‌రాక్‌ సీఈఓ లారీ ఫింక్‌, అడ్నాక్‌ సీఈఓ సుల్తాన్‌ అహ్మద్‌ వంటి అంతర్జాతీయ ప్రముఖులు ఉన్నారు.
  • దేశీయ వ్యాపార దిగ్గజాలు గౌతమ్‌ అదానీ, టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, బిర్లా గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ కుమార్‌ మంగళం బిర్లా, గోద్రేజ్‌ కుటుంబం, ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నందన్‌ నీలేకనీ, ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌ హెడ్‌ సంజీవ్‌ గోయెంకా, విప్రో రిషద్‌ ప్రేమ్‌జీ, ఉదయ్‌ కోటక్‌, అదర్‌ పూనావాలా, సునీల్‌ మిత్తల్‌, పవన్‌ ముంజాల్‌, రోష్ని నాడార్‌, నిఖిల్‌ కామత్‌, రొన్నీ స్క్రూవాలా, దిలీప్‌ సంఘ్వీలకు ఆహ్వానాలు అందాయి.
  • రోహిత్‌ శర్మ, హార్దిక్‌, కృనాల్‌ పాండ్యా, ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌ సహా పలువురు క్రికెటర్లు, బాలీవుడ్‌ నటులు ఈ వేడుకల ఆహ్వానితుల్లో ఉన్నారు.
  • మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు దిల్లీ, ముంబయిల నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. హాలీవుడ్‌ పాప్‌ గాయని రిహన్నాతో పాటు దిల్జీత్‌ దోసాన్జ్‌, ఇతర గాయకులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని