రీసైకిల్డ్‌ పీవీసీ సిమ్‌ల జారీ: ఎయిర్‌టెల్‌

కర్బన ఉద్గారాలను తగ్గించడంలో తన వంతు పాత్రగా, పునర్వినియోగ (రీసైకిల్డ్‌) పీవీసీ సిమ్‌ కార్డులు జారీచేయనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది.

Published : 29 Feb 2024 02:02 IST

దిల్లీ: కర్బన ఉద్గారాలను తగ్గించడంలో తన వంతు పాత్రగా, పునర్వినియోగ (రీసైకిల్డ్‌) పీవీసీ సిమ్‌ కార్డులు జారీచేయనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఇందుకోసం టెక్నాలజీ సొల్యూషన్ల సంస్థ ఐడీఈఎంఐఈ సెక్యూర్‌ ట్రాన్జాక్షన్స్‌తో భాగస్వామాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం వర్జిన్‌ ప్లాస్టిక్‌ సిమ్‌ కార్డులను ఎయిర్‌టెల్‌ ఉపయోగిస్తోంది. రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ సిమ్‌ల వైపు మారుతున్న తొలి   టెలికమ్యూనికేషన్స్‌ సంస్థగా ఎయిర్‌టెల్‌ నిలవనుంది. ఈ నిర్ణయం ద్వారా 165 టన్నులకు పైగా వర్జిన్‌ ప్లాస్టిక్‌ వాడకం తగ్గుతుందని, దీంతో ఒక ఏడాదిలో 690 టన్నులకు పైగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉత్పత్తిని నివారించొచ్చని కంపెనీ తెలిపింది. భారత్‌ నిర్దేశించుకున్న శూన్య ఉద్గారాల లక్ష్యాన్ని సాధించేందుకు తమ వంతు సహకారాన్ని ప్రముఖ బ్రాండుగా కొనసాగిస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ డైరెక్టరు (సప్లయ్‌ చైన్‌) పంకజ్‌ మిగ్లానీ తెలిపారు. తన కార్యకలాపాల నుంచి 2031 నాటికి గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ (జీహెచ్‌జీ) ఉద్గారాలను 50.2% తగ్గించుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని