రూ.123 కోట్ల బ్యాంక్‌ డిపాజిట్లు జప్తు చేసిన ఈడీ

ముంబయి, చెన్నై, కోచి ప్రాంతాల్లో ఇటీవల నిర్వహించిన దాడుల్లో రూ.123 కోట్ల బ్యాంక్‌ డిపాజిట్లను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రకటించింది.

Published : 29 Feb 2024 02:04 IST

చైనా నియంత్రిత జూదం, రుణ యాప్‌లపై కొరడా

దిల్లీ: ముంబయి, చెన్నై, కోచి ప్రాంతాల్లో ఇటీవల నిర్వహించిన దాడుల్లో రూ.123 కోట్ల బ్యాంక్‌ డిపాజిట్లను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రకటించింది. చైనా నియంత్రణలోని జూదం, రుణ యాప్‌లకు సంబంధించిన ఖాతాల్లోని డిపాజిట్లను ‘నగదు అక్రమ చెలామణి’ కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది. ఈ నెల 23-24 తేదీల్లో ఎన్‌ఐయూఎం ఇండియా ప్రై.లి. కంపెనీ, ముంబయిలోని ఆ సంస్థ డైరెక్టర్ల ఇళ్లపై ఈడీ సోదాలు నిర్వహించింది. చెన్నైలోని ఎక్సోడజ్‌ సొల్యూషన్‌ ప్రై.లి, విక్రా ట్రేడింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రై.లి., టైరాన్నస్‌ టెక్నాలజీ ప్రై.లి., ఫ్యూచర్‌ విజన్‌ మీడియా సొల్యూషన్స్‌ ప్రై.లి., అప్రికివి సొల్యూషన్‌ ప్రై.లి.తో పాటు కోచిలోని రాఫేల్‌ జేమ్స్‌ రొజారియో సంస్థపై ఈడీ సోదాలు నిర్వహించింది. ముంబయి, చెన్నై, కోచి ప్రాంతాల్లోని 10 చోట్ల ఈ సోదాలు జరిపామని ఈడీ తెలిపింది. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అక్రమంగా రుణాలు ఇస్తూ వసూళ్ల కోసం బెదిరింపులకు దిగడం, యాప్‌ల ద్వారా జూదం నిర్వహించడంపై పలువురు కేరళ, హరియాణా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా బ్యాంకు డిపాజిట్లను జప్తు చేశామని ఈడీ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని