నరేశ్‌ గోయల్‌కు బెయిల్‌ తిరస్కరణ

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు గురువారం ప్రత్యేక కోర్టు నిరాకరించింది.

Updated : 01 Mar 2024 03:39 IST

2 నెలల పాటు క్యాన్సర్‌ చికిత్సకు అనుమతి

ముంబయి: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు గురువారం ప్రత్యేక కోర్టు నిరాకరించింది. అయితే నచ్చిన హాస్పిటల్‌లో క్యాన్సర్‌ చికిత్స తీసుకునేందుకు రెండు నెలల పాటు అనుమతి ఇచ్చింది. మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన గోయల్‌ (74) ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉన్నారు. క్యాన్సర్‌ చికిత్సకోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వాల్సిందిగా ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. టాటా హాస్పిటల్‌ లేదా ఏదైనా ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు పీఎంఎల్‌ఏ కోర్టు ప్రత్యేక జడ్జి ఎంజీ దేశ్‌పాండే అనుమతి ఇచ్చారు. గత నెలలో ప్రైవేట్‌ హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకునేందుకు గోయిల్‌కు కోర్టు అనుమతి లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని